నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `రైతు`

Balakrishnaనటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే 101 చిత్రానికి సంబంధిచిన విశేషాలను ఆయన అనంతపురంలో ప్రకటించారు. ఇటు సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో సైతం తనదైన ముద్రను వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన హిందూపురం నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఆయన అక్కడి రైతులను కలుసుకుని వారి కష్టసుఖాలను పంచుకున్నారు. రైతులకు రుణ మాఫీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన తన 101వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రైతు దేశానికి ఎంత అవసరం, రైతు సమస్యలేంటి అనే విషయాలను తెలియజేసే చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనున్న `రైతు` చిత్రమే తన 101వ చిత్రమని ప్రకటించారు. ప్రజా సమస్యలపై తనదైన శైళిలో గళమెత్తే నందమూరి బాలకృష్ణ రైతు సినిమాలో నటించనుండటం పట్ల ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియపరుస్తారు.

To Top

Send this to a friend