నందమూరి అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్

Balakrishna

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన `లెజెండ్` చిత్రం 900 రోజులు విజయవంతంగా  ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్ లో రేపటి నుండి( అక్టోబర్ 5) జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రే హీరో సినిమాల‌కు లేని విధంగా బాల‌కృష్ణ అభిమానులు `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రానికి ఇలా స్వాగ‌తం ప‌లక‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఈ అరుదైన విషయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోనుంది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ న‌టించిన 100 సినిమా కోసం ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

To Top

Send this to a friend