ధ్రువ బాగున్నా భారీ హిట్ కాకపోవడానికి కారణమేంటి..?

Druva_movie_team

తమిళనాట ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాను ఎంచుకొని రాంచరణ్ రిమేక్ కు సిద్ధమయ్యాడు. మంచి టేకింగ్ తో సంచలన విజయాలు నమోదు చేసిన సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకున్నారు. రిమేక్ లంటే పెద్దగా ఇష్టపడని సురేందర్ రెడ్డి కూడా రాంచరణ్ కోరిక మేరకు సినిమాను ఒప్పుకొని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అరవింద్ స్వామి లాంటి తమిళ అగ్రనటులను విలన్లుగా పెట్టి సినిమాను తీశారు. అయినా ఈ సినిమా హిట్ అయ్యింది. భారీ హిట్ కాలేదు.. బ్లాక్ బస్టర్ కాలేదు.. ఎందుకు..కథ బాగుంది.. కథనం బాగుంది.. దర్శకుడు బాగా తీశారు.. అందరూ ఆకట్టుకున్నా ఎందుకు నామమాత్ర విజయమే సాధించిందనే ప్రశ్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిఒక్కరిని తొలుస్తోంది..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డౌన్ ట్రెండ్ నడుస్తోంది.. పెద్దనోట్ల రద్దు జనంపై తీవ్ర ప్రబావం చూపింది. వ్యాపారాలు పడిపోయాయి. కొనుగోళ్లు నిలిచిపోయాయి. జనం తమ అవసరాలకు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కట్టడానికే సరిపోతుంది. వచ్చే 2 వేలతో మూడు నాలుగు రోజులు సరిపోకపోవడంతో మళ్లీ బ్యాంకుల చుట్టే తిరుగుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేనిస్థితిలో ఉన్న జనం ఇప్పుడు సినిమాలు చూసే ఒపికలో లేరు.. అందుకే ప్రస్తుతం చిరంజీవి 150 సినిమా రిలీజ్ అయినా కూడా పెద్దగా కలెక్షన్లు వచ్చే పరిస్థితి లేదు. జనం దగ్గర డబ్బు లేదు.. ఉన్నా అవసరాలకే పోతోంది.. సో మంచి సినిమా ధ్రువకు కూడా కలెక్షన్ల ప్రభావం పడి పెద్దగా రాబడి రాలేదని తెలుగు సినిమా వర్గాలు విశ్లేషిస్తున్నాయి..

To Top

Send this to a friend