‘ధ్రువ-నక్షత్రం’

11041026_919573091441644_5145039467683596008_n
 ‘నక్షత్రం’ తొలి పది ప్రచారచిత్రాలను విడుదల చేయనున్న మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’
‘నక్షత్రం’ : ఈ చిత్రం  ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రం తొలి పది ప్రచార చిత్రాలను మరికొద్ది రోజులలో విడుదల చేయనున్నారు  మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’. ఈ విషయాన్ని మీడియాతో పంచుకుంటున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. ‘నక్షత్రం’ లోగో,  ప్రచార చిత్రాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
“పోలీస్” అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ “నక్షత్రం” అని తెలిపారు దర్శకుడు కృష్ణ వంశీ.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తునారీ ‘నక్షత్రం’ చిత్రాన్ని.
సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్, రెజీనా,ప్రగ్య జైస్వాల్ ప్రధాన తారాగణం.
To Top

Send this to a friend