ధోనిలో లేనిది.. కోహ్లీలో ఉన్నది అదే.

మహేంద్రసింగ్ ధోని.. భారత క్రికెట్ టీం గర్వించదగ్గ ఆటగాడు.. ఎప్పుడో కపిల్ దేవ్ తర్వాత .. టీమిండియాకు వన్డే, టీట్వీంటీ ప్రపంచకప్ లు అందించిన దిగ్గజ క్రికెటర్.. ఆటగాడిగా, కెప్టెన్ గా అద్భుతంగా రాణించిన ధోని.. తాను మునుపటిలా ఆడలేకపోతున్నందుకు చింతించలేదు.. కెప్టెన్ పదవికి రాజీనామా చేసి క్రికెటర్ గా విశేషంగా రాణిస్తున్న కోహ్లీకి పగ్గాలు అప్పగించాడు. నిజానికి ఇంకో ఐదేళ్లు లేదా వచ్చే 2019 ప్రపంచకప్ వరకూ కూడా ధోని కెప్టెన్సీకి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ఆదినుంచి యువ క్రికెటర్లను ఎంకరేజ్ చేయడంలో ధోనీ ముందున్నారు. అందుకే తాను ఆడలేకపోతున్నందుకు బాధపడకుండా.. బాగా ఆడుతున్న కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు సందేహించలేదు. నాడు టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్న దోనీ.. వన్డేల్లో కూడా అలాగే వదులుకోవడం సంచలనం సృష్టించింది..

ఇక కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా దూసుకొస్తున్నాడు. తన వేగవంతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ల్లో 4-0తో కొట్టిన కోహ్లీ ఔరా అనిపించాడు. ఆ తర్వాత ధోనీ రాజీనామా వన్డే పగ్గాలు చేపట్టాడు. చేపట్టడంతోనే ధోనీ ఫార్ములాకు మంగళం పాడాడు. ధోనీ కుర్రాళ్లకే అవకాశం ఇచ్చేవాడు. కానీ కోహ్లీ కుర్రాళ్లకు, సీనియర్స్ కు జట్టులో చోటు కల్పించాడు. కోహ్లీ తన టీంలో సీనియర్ అయిన యువరాజ్ , ధావన్ లకు.. జూనియర్స్ అయిన కేదార్ జాదవ్, పాండ్యాలకు చోటు కల్పించి జట్టును సమతూకం చేశాడు. అదే ధోనీ ఉంటే సీనియర్ అయిన యూవీకి చోటు దక్కి ఉండేది కాదన్నది బహిరంగ రహస్యమే. కోహ్లీ తీసుకున్న ఈ స్టెప్ విజయవంతం అయ్యింది. రెండో వన్డేలో సీనియర్లయిన యూవరాజ్, ధోనీలు సెంచీరీలు చేసి భారత్ కు విజయన్నందించారు. కేదార్ జాదవ్, పాండ్యలు సైతం చివరి వన్డేలో విజయం అంచులవరకు తీసుకొచ్చారు. ఇలా ధోని జూనియర్ ఫార్ములా.. కోహ్లీ సీనియర్-జూనియర్ ఫార్ములాలు వేరువేరుగా ఉన్నాయి. కానీ కోహ్లీ ఐడియాలజీ పనిచేస్తుందో లేదో మున్ముందు చూడాలి.

To Top

Send this to a friend