`ధృవ` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌ 

dsc_1418

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్యక్ర‌మాన్ని శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత అల్లుఅర‌వింద్‌, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి, హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా…. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ – “ ధృవ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేయాలి అనుకున్నాం. అయితే…నోట్ల ర‌ద్దు వ‌ల‌న థియేట‌ర్స్ కి ప్రేక్ష‌కులు వ‌చ్చి సినిమా చూస్తారా అనే సందేహం వ‌చ్చింది. దీంతో ఈ విష‌యం పై రీసెర్చ్ చేయిస్తే 9వ తారీఖున అయితే బాగుంటుంది జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉంటాయి అని తేలింది. అందుచేత ధృవ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే…ఈ ట్రైల‌ర్ ను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో రిలీజ్ చేయాల‌ని ముంద‌గా ప్లాన్ చేసుకున్నాం. అయితే నేను ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను త్వ‌ర‌గా ఈ ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నుకున్నాను. అందుకే ఈరోజున ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. హైద‌రాబాద్‌లోనే కాకుండా త్వ‌ర‌లోనే వైజాగ్, తిరుప‌తి, విజ‌య‌వాడ కూడా వెళ్లి అక్క‌డా కూడా ధృవ సినిమా ప్ర‌మోష‌న్స్ చేయాలి అనుకుంటున్నాం. యు ఎస్ ఎ ప్రీమియ‌ర్ కి యూనిట్ వెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నాం. న్యూ జెర్సీ, శాన్‌ఫ్రాన్సికో స‌హా మ‌రో యు.ఎస్‌లో మ‌రో చోట కూడా ప్రీమియ‌ర్ ఉంటుంది. అలాగే మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డిసెంబ‌ర్ 4న గ్రాండ్ గా చేస్తున్నాం. ఈ ఫంక్ష‌న్‌కి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను కి గెస్ట్ లు ఎవ‌రు అనేది త్వ‌ర‌లో తెలియ‌చేస్తాం అన్నారు.

నిర్మాత ఎన్.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ “చిరంజీవి గారితో ఖైదీ సినిమా నుంచి ప‌రిచ‌యం. అలాగే అర‌వింద్ గారితో చెన్నై నుండి అంటే దాదాపు 30 ఏళ్ల నుండి మంచి అనుబంధం ఉంది. అర‌వింద్ వంటి గొప్ప నిర్మాత పేరు ప‌క్క‌న స్ర్కీన్ పై నా పేరు చూసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. చ‌ర‌ణ్ నుండి మెగాఫ్యాన్స్ ఎలాంటి హిట్‌ను కోరుకుంటున్నారో అలాంటి నాలుగు రెట్ల హిట్‌ను అందించేంత గొప్ప చిత్రం ధృవ. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ – “అంద‌రిలాగే నేను కూడా ధృవ సినిమా కోసం చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌తో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డాం. మా అంద‌రి కంటే ఎక్కువ చ‌ర‌ణ్ క‌ష్ట‌ప‌డ్డాడు. నాకు అవ‌కాశం ఇచ్చిన అల్లు అర‌వింద్ గారికి, ఎన్.వి.ప్ర‌సాద్ గారికి థాంక్స్“అన్నారు.

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ – “ధృవ సినిమా నాకు చాలా స్పెష‌ల్. ఎందుకంటే గీతా ఆర్ట్స్ లో నాకు ఇది రెండో సినిమా. అలాగే చ‌ర‌ణ్ తో రెండో సినిమా. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో కూడా రెండో సినిమా. నా ఫేవ‌రేట్ మూవీ త‌ని ఓరువ‌న్. ఈ సినిమాని తెలుగులో ఎవ‌రైనా రీమేక్ చేస్తారా అనుకున్నాను. నేను అనుకున్న‌ట్టుగానే రీమేక్ చేయాల‌నుకోవ‌డం అందులో నాకు అవ‌కాశం రావ‌డం చాలా ల‌క్కీగా ఫీల‌వుతున్నాను. ఈ సినిమాలో స్ర్కీన్ ప్లే చాలా కొత్త‌గా ఉంటుంది. చ‌ర‌ణ్ లుక్ చాలా కొత్త‌గా ఉంటుంది. అంద‌రికీ ధృవ న‌చ్చుతుంది“ అన్నారు.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ – హిప్ హాప్ త‌మిళ , ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఆర్ట్ – నాగేంద్ర, ఎడిటర్ – నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు – సురేందర్ రెడ్డి.

To Top

Send this to a friend