దేశంలో చిల్లర కష్టాలు ఎదురయ్యాయా..?

gujarath

మీడియా, పేపర్లు అలానే ఊదరగొడతాయి.. పెద్ద నోట్ల రద్దు, చిల్లర కష్టాలు అంటూ తెగ మోసేస్తుంటారు.. కానీ నిజంగా నోట్లరద్దుతో దేశంలో చిల్లర కష్టాలు ఎదురయ్యాయా..? అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అలా లేవు.. నిజం..
దేశంలో డబ్బులున్నాయి.. కానీ కొందరు దాచేశారు.. అవసరమైనప్పుడు ఇలా బయటకు వస్తూనే ఉంటున్నాయి.. గుజరాత్ లో అదే జరిగింది.. చిల్లర దొరకక జనం క్యూల్లో అవస్థలు పడుతుంటే.. ఏకంగా 40 లక్షల రూ.10, రూ.20 నోట్ల గానామృతానికి ఫిదా అయ్యే చల్లేశారు.. 40 లక్షల నోట్లంటే ఎంతో మంది చిల్లర కష్టాలు తీరుతాయి.. ఇక్కడ కొందరు బడాబాబులు గానకచేరిలో పాటలకు ఫిదా అయ్యి వారిపై చల్లేశారు..
గుజరాత్ లోని నవ్ సారి జిల్లాలో ఓ సంగీత కచేరి సోమవారం గ్రాండ్ గా జరిగింది.. గుజరాతీ ప్రఖ్యాత గాయకులు ఫరీదా మీర్, మాయాభాయ్ అహిర్ లపై పాటల ప్రేమికులు రూ.10, రూ.20 ల రూ. 40 లక్షల నోట్లను గాయకులపై చల్లారు.. ఆ సభా వేదిక, గాయకుల చుట్టుపక్కలా అంతా నోట్లు గుట్టలుగా పేరుకుపోయాయి. మీడియా కంట పడడంతో దేశంలో చిల్లర లేవు అన్నది ఉట్టి అపోహే అని అందరూ చర్చించుకుంటున్నారు.. విలాసాలకు, విందులకు వచ్చే చిన్ననోట్లు పేదల కష్టాలు తీర్చేందుకు రాకపోవడం బాధకరమని తిట్టిపోస్తున్నారు.
-నరేశ్, సీనియర్ జర్నలిస్ట్

To Top

Send this to a friend