దేని కోసమైతే కేసీఆర్ కొట్లాడాడో.. అక్కడే దెబ్బ పడింది..

telangana-brijeshtrubunal-supremecourt

సుప్రీం కోర్టు నిర్ణయం.. కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద దెబ్బలా మారింది.. కృష్ణ, గోదావరి నదుల్లో నీటి పంపాకాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటిలోంచే తెలంగాణ, ఏపీ పంచుకోవాలని గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నిచ్చింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో నాటి ఉమ్మడి ఏపీ తీవ్ర అన్యాయం చేసిందని.. రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణకు నీటి వాటా న్యాయంగా రావడం లేదని పిటీషన్ లో పేర్కొంది.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలతో సమానంగా తెలంగాణకు నీటి కేటాయింపులు చేయాలని కోరింది.. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కృష్ణా నది పరివాహకంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులను లెక్కకట్టి న్యాయం చేయాలని తెలంగాణ వాదించింది.. కానీ సుప్రీం ఈ వాదనను ఏకీభవించలేదు..

అయితే ఈ వాదనను మహారాష్ట్ర, కర్నాటక తప్పు పట్టాయి. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటి వాటాలోనే తెలంగాణ, ఏపీ తేల్చుకోవాలని వాదించాయి. వారి వాదనతో ఏకీభవించిన సుప్రీం తెలంగాణ పీటీషన్ ను కొట్టివేసింది.. తెలంగాణ విడిపోయి తెలంగాణ ఏ, తెలంగాణ బీ ఏర్పడితే మళ్లీ నీటి కేటాయింపులు చేస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది..

ఈ దెబ్బకు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిన మాట వాస్తవం.. నాగార్జున సాగర్ పరివాహకం మొత్తం ఏపీకే పోతోంది. దాన్నుంచి పోతిరెడ్డి పాడు, హందీనీవా, నెట్టంపాడు తదితర ఏపీ ప్రాజెక్టులకు నీరు పోతోంది. తెలంగాణలో జూరాల లాంటి చిన్న ప్రాజెక్టు తప్ప నీటిని వాడుకునే అవకాశం లేదు. ఉమ్మడి పాలనలో నీటి కోసం జరిగిన అన్యాయంపై తెలంగాణ సర్కారు సుప్రీం గడప తొక్కినా అక్కడా న్యాయం జరగలేదు.. దీంతో కేసీఆర్ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

To Top

Send this to a friend