దుమ్ము దులిపే డ్యాన్సులతో బాస్ ఈజ్ బ్యాక్.. మాస్ రాక్స్..

khaidi No 150_still1

బాస్ నిజంగా మళ్లీ దుమ్ము దులిపేందుకు వచ్చాడు.. 60 ఏళ్లు వచ్చిన రజినీ, కమల్ హాసన్, అమితాబ్ లాంటి అగ్రహీరోలు వేయని స్టెప్పులను మళ్లీ మన మెగాస్టార్ కుర్ర హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్ లా దుమ్ము దులిపే డ్యాన్సులతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు..
నూతన సంవత్సర కానుకగా విడుదలైన చిరంజీవి ఖైదినెంబర్ 150 మూవీలోని రత్తాలు ఊర మాస్ సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, సాహిత్యం అందించిన ఈ పాట ఈరోజు నెట్ లో దుమ్ముదులుపుతోంది.. చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయేలా ఉన్నాయి.. ప్రతిపాట ఓ ముత్యంలా ఉన్న చిరంజీవి 150 వ చిత్రం సంకాంత్రి కానుకగా రాబోతోంది. ఇప్పటికే పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది.. ఈరోజు విడుదలైన రత్తాలు సాంగ్ అయితే సినిమాపై అంచానాలు మరింత పెంచేసింది.. ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది..
ఖైదీనంబర్ 150 మూవీలోని రత్తాలు సాంగ్ ను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend