దీపావళికి `పిల్ల రాక్ష‌సి`

947a6447
`బిచ్చగాడు` వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి  అందిస్తున్న మరో చిత్రం పిల్ల రాక్షసి. ఓ  ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌నే కాన్సెప్ట్ తో రూపొంది మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. `బిచ్చ‌గాడు` చిత్రానికి తెలుగులో మాట‌లు, పాటలు అందించిన ఆ సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన ర‌చ‌యిత భాషా శ్రీ మ‌ల‌యాళ చిత్రం `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` తెలుగు అనువాదానికి మాట‌లు, పాట‌లు అందిస్తున్నారు.  సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
దర్శ‌కుడు మిథున్ మాన్యూల్ థామ‌స్  డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ను రియ‌లిస్టిక్‌ పంథాలో ఆవిష్క‌రించారు. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో పాటు,  మ్యాజిక్‌ ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా ఉంటుంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు.  `ఓకే బంగారం` ఫేం దుల్కర్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా,  సారా అర్జున్‌ టైటిల్ పాత్ర‌లో న‌టించింది.  స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
To Top

Send this to a friend