దిల్ రాజుపై నాగార్జున సీరియస్..

అగ్రహీరో నాగార్జున నిర్మాత దిల్ రాజు ను ఉద్దేశించి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం టాలీవుడ్ లో దుమారం రేపుతోంది.. నాగార్జున తో సంప్రదించకుండానే దిల్ రాజు ఇటీవల శతమానం భవితి సినిమా ఆడియో వేడుకలో ఓ మల్టీస్టారర్ మూవీ తీస్తున్నట్లు ప్రకటించారు. అందులో నాగార్జున, చైతన్య కలిసి నటిస్తారని తెలిపారు. అయితే ఇది నాగార్జున ఒప్పుకున్నాడో లేదో తెలియదు.. చివరకు నాగార్జునకే ఈ వార్త తెలిసి ట్విట్టర్ లో మండిపడ్డారు.

నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ ..‘నేనూ ఇవాళ ఒక వార్త వింటున్నాను.. చదువుతున్నాను. నేను, చై కలిసి మరోసారి మల్టీస్టారర్ సినిమా తీస్తున్నామట.. నాక్కూడా ఇది ఒక వార్తే..’’ అంటూ ట్విట్టర్ లో పరోక్షంగా దిల్ రాజు చెప్పిన మాటలపై సెటైర్ విసిరారు.. దిల్ రాజు పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినా.. ఇటీవలే ఆయన శతమానం భవతి సినిమాలో నాగార్జున, చైతన్యతో సినిమా ప్రకటించడంతో నాగార్జున దానికి కౌంటర్ ఇచ్చాడని సినీ జనాలు విశ్లేసిస్తున్నారు.

కాగా ఇంతకుముందు కూడా దిల్ రాజుతో సినిమా చేయడానికి నాగార్జున ఒకసారి ఒప్పుకోలేదట.. నాగార్జునకు ఓ కథ కరెక్టుగా సూటవుతుందని భావించినా.. ఆయన చాన్స్ ఇవ్వకపోవడంతో రవితేజతో తీశారట.. అప్పుడు చెడిన వీరిద్దరి స్నేహం మరోసారి దిల్ రాజు వ్యాఖ్యలతో పెద్దది అయ్యింది..

To Top

Send this to a friend