దాసరి నారాయణరావు సీరియస్

దిగ్గజ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం తీవ్ర శ్వాస కోస సంబంధిత సమస్యతో దాసరి ఆస్పత్రిలో చేరినట్లు కిమ్స్ ఆస్పత్రి వర్గాలు ఈరోజు తెలిపాయి. దాసరి నారాయణ రావుకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని.. ఆయన కోలుకుంటున్నట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి.
కాగా దాసరి అనారోగ్యం గురించి తెలియగానే తెలుగు సినీ ప్రముఖులు కిమ్స్ ఆస్పత్రికి క్యూ కట్టారు. దాసరి అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు పలువురు దాసరి నారాయణ రావు కోలుకోవాలని ఆకాంక్షించారు.
కొంతకాలంగా దాసరి నారాయణ రావు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన 2014లో విష్ణు హీరోగా ఎర్రబస్సు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఇంతవరకూ ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. ఇటీవల చిరంజీవి ఆడియో ఫంక్షన్ కు హాజరై దాసరి.. మాట్లాడి అలరించారు. పవన్ కళ్యాన్ తో ఓ సినిమా త్వరలో తీస్తున్నట్టు ప్రకటించారు.

To Top

Send this to a friend