దళిత భోజనం: బీజేపీ పరువు తీసిన కేసీఆర్

ఇప్పుడు నాయకుల పర్యటనలు మీడియా కవర్ చేయకపోయినా సోషల్ మీడియా మాత్రం అన్నింటిని కవర్ చేస్తోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు విలేకరి అవుతున్నారు. తెరవెనుక బాగోతాలను తేటతెల్లం చేస్తున్నారు.

అమిత్ షా నల్గొండ జిల్లాలో దళితులతో కలిసి బోజనం చేశారు. మేం దళితపక్షపాతి అని చాటారు. కానీ ఆయన దళితులతో బోజనం చేసింది వాస్తవమే అయినా ఆ బోజనాన్ని ఓ రెడ్డి సామాజికవర్గ నేత తోటలో వండించుకొచ్చారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫొటోలు విస్తృతంగా వ్యాపించాయి. అంతేకాదు.. అమిత్ షా పక్కన కిషన్ రెడ్డి, మరికొందరు రెడ్డిలను కూర్చోబెట్టుకొని స్థానిక దళిత నాయకుడిని నిలబెట్టారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టారు.

ఇక అమిత్ షా దళిత బోజనం కథాకమామిషును కేసీఆర్ సైతం లేవనెత్తి కడిగిపారేశాడు. దళితుల ఇంట్లో బోజనం అని చెప్పి దళితుల ఇంట్లో వండకుండా ఓ రెడ్డి తోటలో వండించుకువచ్చారని.. ఇది మీ దళిత పక్షపాతం అని కేసీఆర్ కడిగేయడంతో ఈ వార్త దావనంలా వ్యాపించింది. దళిత మైలేజీ కాస్త బీజేపీకి రివర్స్ అయ్యింది. దీంతో మరునాడు అమిత్ షా దళితుల ఇంట్లో వండిన అన్నమే తినడం గమనార్హం. ఇలా దళిత బోజనం ఎఫెక్ట్ బీజేపీ అధ్యక్షుడికి గట్టి షాక్ ఇచ్చింది.

అమిత్ షా భోజనం చేస్తుండగా వెనుకాల నిలబడ్డ స్థానిక బీజేపీ దళిత నాయకుడు ఫొటోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend