దర్శకుడితో ఎన్టీఆర్‌ విభేదాలు!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయడం జరిగింది. ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ విషయంలో దర్శకుడు బాబీ కాస్త విభేదించడం జరిగిందట. మొదట ఎన్టీఆర్‌ డీ గ్లామర్‌ లుక్‌ను బాబీ ప్లాన్‌ చేశాడట. అయితే బర్త్‌ డే రోజు డీ గ్లామర్‌గా కనిపిస్తే ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారని ఎన్టీఆర్‌ దర్శకుడి నిర్ణయాన్ని తోసిపుచ్చాడు.

ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు దర్శకుడు బాబీని ఒప్పించి ఆ రెండు స్టిల్స్‌ను ఫైనల్‌ చేయించారు. ఎన్టీఆర్‌ను తాను అనుకున్నట్లుగా చూపించి ఉంటే సినిమాపై పిచ్చపిచ్చగా ప్రచారం జరిగేదని, సినిమా కోసం ప్రేక్షకులు పిచ్చోల్ల మాదిరిగా ఎదురు చూసేవారు అంటూ దర్శకుడు బాబీ సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. ఫస్ట్‌లుక్‌ విషయంలో తప్ప మరే విషయంలో కూడా ఎన్టీఆర్‌ తన పనికి అడ్డు చెప్పలేదని, తాను చెప్పినట్లుగా నడుకుంటూ వెళ్తున్నాడని బాబీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

To Top

Send this to a friend