దక్షిణాది రైతులేం పాపం చేశారు.?


మోడీ ప్రభుత్వం దేశ సమగ్రత ముప్పువాటిల్లేలా చేస్తోందని.. రాష్ట్రాలన్నింటిని ఒకేలా చూడాల్సిన కేంద్రం.. ఉత్తరాది సొంతబిడ్డలా.. దక్షిణాదిని సవతి బిడ్డలా చూస్తోందని పవన్ కళ్యాణ్ మోడీ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. మోడీ ప్రభుత్వం యూపీలో గెలిచాక అక్కడి రైతులకు కేంద్రం తరఫున రుణమాఫీ చేయాలనుకోవడంపై ఆయన వరుస ట్వీట్లు చేస్తూ విమర్శలు గుప్పించారు..

‘ఆత్మహత్యలు, రుణభారంతో కుములుతున్న రైతాంగం కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రుణమాఫీని అమలు చేశాయి. ఆ మాఫీ భారాన్ని భరించాలని ఆ ప్రభుత్వాలు, రైతులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు..’ అంటూ మోడీ తీరుపై ట్విట్టర్ లో పవన్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు..

‘దేశంలో విచ్చిన్నవాదం తలెత్తుతోంది. విభజనవాదం పెరుగుతోంది.. ఈ వాస్తవాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని.. దక్షిణాది రాష్ట్రాలను విస్మరించడం సరికాదు.. ’ అని మరో ట్వీట్ పవన్ చేశారు.. యూపీలాగే దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలన్న కాంగ్రెస్ , శివసేన సభ్యుల డిమాండ్ ని బీజేపీ పట్టించుకో లేదు. దీనిపై వాకౌట్ చేసినా బీజేపీ కనికరించకపోవడం దారుణం.. అని పవన్ పేర్కొన్నారు.

To Top

Send this to a friend