అప్పట్లో రాంగోపాల్ వర్మ ఓ సవాల్ విసిరాడు.. తాను తీసిన దెయ్యం సినిమాను మొత్తం థియేటర్ లో ఒక్కడే కూర్చొని చూస్తే లక్షలు ఇస్తానని ప్రకటించాడు. కొందరు ప్రయత్నించి విరమించుకోగా.. మరికొందరు ప్రయత్నించి టపా కట్టారు..కానీ ఒక వ్యక్తి చూసి ఆ లక్షలు కొల్లగొట్టాడు. అందరికీ ఆ ధైర్యం ఉండకపోవచ్చు.. కానీ దెయ్యాల సినిమాలు చూసేటప్పుడు నిజంగానే ధైర్యం కావాలి.. లేదంటే సిద్దిపేటలో జరిగిన సంఘటనే పునరావృతం అవుతుంది..
సిద్దిపేటలోని ఎన్ టీఆర్ నగర్ కు చెందిన ఎండీ షాదుల్ (28) మంగళవారం సిద్దిపేటలో శ్రీనివాస థియేటర్ లో సినిమాకు వెళ్లాడు. ‘ఇంట్లో దెయ్యం’ సినిమా చూస్తూ ఉన్నాడు. ఇంటర్వెల్ వచ్చే సమయానికి షాదుల్ గుండెపోటుతో సృహ తప్పిపోయాడు. తోటి ప్రేక్షకులు గమనించి 108 సిబ్బందిని రప్పించినా అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు.. అది ఇటీవలే విడుదలైన ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయ్యం‘ మూవీ.. ఇలా భయపడే వారు అలాంటి సినిమాలు చూడకపోతేనే మంచిది. లేకపోతే ఇలానే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది..
