త్రివిక్రమ్ మదిలో ఆ హీరోలే ఎందుకుంటున్నారు..?

trivikram-apnewsonlinein

క్రియేటివిటీ దర్శకుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ కష్టపడి పైకి ఎదిగారు. అతడు సినిమాతో అతడి స్టామినా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అనంతరం ఖలేజాతో యావరేజ్ పలకరించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీతోనే సినిమాలు తీస్తున్నారు త్రివిక్రమ్.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీశారు. మధ్యలో నితిన్ తో తీసిన సినిమా కూడా అదీ పవన్ సూచిస్తేనే చేసింది.. మరి త్రివిక్రమ్ మిగతా హీరోలతో ఎందుకు సినిమా తీయరనే ప్రచారం టాలీవుడ్ లో నెలకొంది.. సునీల్ తన రూమ్మేట్ అయినా కూడా అప్పట్లో సినిమా తీస్తానని మళ్లీ కొన్నికారణాలతో విరమించుకున్నాడు.
త్రివిక్రమ్ సినిమాలు మొత్తం మెగా ఫ్యామిలీ, మహేశ్ తోనే తీసినవి ఎక్కువగా ఉన్నాయి. మరి మిగతా హీరోలతో త్రివిక్రమ్ కు పడదా లేక అలాంటి వారి తో కథలు సాధ్యం కాదో తెలియదు కానీ త్రివిక్రమ్ మాత్రం హీరోల విషయంలో ఒక విజినరీతో ముందుకెళ్తున్నారు. పవన్, మహేశ్ లనే హీరోలుగా తన మదిలో ఊహించుకున్నట్టు ఉన్నాడు. మధ్యలో అల్ల అర్జున్ ను కనికరించాడు.. ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా.. తను హీరోలను ముందుపెట్టుకొని కథలు రాసుకుంటానని.. అందుకే కాబోలు వేరే వాల్లతో సినిమాలకు త్రివిక్రమ్ అంత సుముఖంగా లేడనిపిస్తోంది..

To Top

Send this to a friend