త్రిపుర రాష్ట్రాన్ని చూసి ఏపీ, తెలంగాణ నేర్చుకోవాలి..

– త్రిపురలో రైతు ఆత్మహత్యలే లేవు!

– 97 శాతం అక్షరాస్యత

– విద్యా, వైద్యం పూర్తి ఉచితం..

ఈశాన్య భారతంలోని చిన్న రాష్ట్రం త్రిపుర.. తెలంగాణ కంటే తక్కువే విస్తీర్ణం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు మన కంటే హ్యాపీగా ఉంటున్నారు.. రైతు ఆత్మహత్యలు అస్సలే లేవు.. 97శాతం అక్షరాస్యత సాధించారు. అక్కడి ప్రజలందరికి సర్కారు విద్యా, వైద్యం పూర్తిగా ఉచితం.. అంత నాణ్యమైన సేవలు అందిస్తారు కాబట్టే ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రులు, బడులకే వెళుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు.. విద్యా, వైద్యంప్రైవేటు పరమైంది. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ ఆరోగ్య శ్రీ లాంటి పథకాలతో ప్రైవేటుకు దోచిపెడుతున్నాయి. అవే డబ్బులతో ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తే ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరేది. ఇక విద్య విషయంలోనైతే మరీ దారుణం.. ఎల్ కేజీకే 20వేల ఫీజులు.. ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టుపట్టించి ప్రైవేటు విద్యను మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.. త్రిపుర లో జనాలందరూ ప్రభుత్వ విద్య, వైద్యానికే ప్రాధాన్యమిస్తారు. అక్కడి ప్రభుత్వం వ్యవస్థలను అంతలా పటిష్టం చేసింది.. త్రిపుర రాష్ట్రాన్ని చూసి మ‌న‌లాంటి రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మ‌న ప్ర‌భుత్వం మాట‌ల్లో కాదు చేత‌ల్లో నిరూపించుకోవాల్సి ఉంది..

త్రిపురలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అన్నారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయం మానవ అభివృద్ధి అధ్యయన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పొలిటికల్‌ ఎకానమీ ఆఫ్‌ త్రిపుర’ అనే సదస్సులో సోమవారం ఆయన ప్రసంగించారు. ‘20 ఏళ్ల క్రితం త్రిపురలోని భూములన్నీ కొందరి చేతుల్లో ఉండేవి. స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగేవి కావు. నేడు 100 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోంది. వ్యవసాయ భూములను అందరికీ లభించేలా చర్యలు తీసుకున్నాం. 97 శాతం అక్షరాస్యత సాధించాం. 90 శాతం ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకుంటారు. ప్రాథమిక విద్య నుంచి పీయూసీ వరకూ ఒక్క రూపాయి కూడా రుసుం వసూలు చేయటం లేదు’ని మాణిక్‌ సర్కార్‌ వివరించారు. ఇలా మన రాష్ట్రాల్లో కూడా ఉంటే మన బతుకులు బాగుపడి ఉండేవాని అందరూ భావిస్తున్నారు..

To Top

Send this to a friend