తెలుగు ప్రేక్ష‌కులకు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు: చిరంజీవి

Chiru (3)

తెలుగు ప్రేక్ష‌కులకు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. పాతను మ‌రిచి, కొత్త‌ద‌నాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూత‌న సంవ‌త్స‌రంలో టాలీవుడ్ మ‌రింత ప‌సందుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కాబోతోంది. మ‌రిన్ని మంచి సినిమాలు మిమ్మ‌ల్ని అల‌రించేందుకు ఈ ఏడాది వ‌స్తున్నాయి.

ఈ సంవ‌త్స‌రం నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ 150వ సినిమాగా.. `ఖైదీనంబ‌ర్ 150`చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఇది ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూవ్‌మెంట్‌. సంక్రాంతికి మీరంద‌రూ మెచ్చే సినిమాగా వ‌స్తోంది.

నా ఈ రాక‌ను అభిమాన ప్రేక్ష‌కుల‌తో పాటు త‌మ్ముళ్లంతా ప్రేమాభిమానాల‌తో వెల్‌కం చెబుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా గ‌ర్వించేలా.. ఇదిరా చిరంజీవి సినిమా అనేలా `ఖైదీనంబ‌ర్ 150` చిత్రాన్ని ఇస్తున్నా.

మ‌రోసారి మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు..
థాంక్యూ..& హ్యాపీ న్యూ ఇయ‌ర్ ..
– మీ చిరంజీవి

To Top

Send this to a friend