తెలుగు ప్రజలు చల్లగుండాలే..


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం తిరుమల వేంకటేశ్వరుడికి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం సతీసమేతంగా.. మంత్రులు, కూతురు కవిత, కుటుంబ సభ్యులు వెంటరాగా కేసీఆర్ రూ.5 కోట్లతో చేయించిన స్వర్ణాభరణాలను వేదపండితుల సాయంతో తిరుమల వేంకటేశ్వరుడికి అందజేశారు. 3.72 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామ హారం.. 1.21 కోట్ల విలువైన 4.650 కిలో ల స్వర్ణ కంఠాభరణాలను టీటీడీకి అందజేశారు.
శ్రీవారి సేవలో పాల్గొన్న కేసీఆర్ కు తిరుమల తిరుపతి ఈవో సాంబశివరావు, జేవో రరాజులు దగ్గరుండి అన్నీ సమకూర్చారు. వివిధ ఆలయాలను చూపించి దర్శనం చేయించారు. శ్రీ వారి సేవలో పాల్గొన్న అనంతరం కేసీఆర్ వకుళామాతను, శ్రీవిమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు వేశారు. చివరగా విలేకరులతో మాట్లాడిన కేసీఆర్ .. తిరుమల వెంకన్నకు మొక్కిన మొక్కు తీర్చుకున్నానని.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని.. కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, మంత్రి బొజ్జలలు తనకు మంచి ఆతిథ్యం ఇచ్చారని కేసీఆర్ ప్రశంసించారు.
కేసీఆర్ తిరుమల శ్రీవారి చెల్లించిన మొక్కులు వీడియోను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend