తెలుగులో రీమేక్ కానున్న మెట్రో

తమిళంలో జూన్ 24 న రిలీజ్ అయి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న మెట్రో తెలుగులో రీమేక్ కానుంది. ఆది హీరోగా తెరకెక్కి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చుట్టాలబ్బాయి నిర్మాత రామ్ తాళ్ళూరి SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి రైట్స్ సొంతం చేసుకున్నారు. సురేష్ కొండేటి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.

 

తన కన్నతల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్… ఆ క్రమంలో తను  తెలుసుకున్న నిజాలేంటి..? అవతల చైన్ స్నాచర్ ల లక్ష్యమేంటి..? అనే కథాంశంతో తెరకెక్కిన మెట్రో… తమిళనాట సంచలన విజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

మెట్రో తెలుగులో యూత్ ఫుల్ యంగ్ హీరో ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. బాబీసింహ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మాడరన్ క్రిమినల్ మైండ్ సెట్ ని ఎక్స్ పోజ్ చేస్తూ క్రైం థ్రిల్లర్ గా… ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కనున్న మెట్రో మిగతా వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు చిత్రం యూనిట్.

To Top

Send this to a friend