తెలంగాణ బడ్జెట్ విశేషాలు..


తెలంగాణ వార్సిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని.. ఇందులో బడుగు బలహీన వర్గాల వారికి బడ్జెట్ లో పెద్దపీట వేశామని తెలిపారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రణాళిక-ప్రణాళికేతర బడ్జెట్ కు స్వస్తి పలికారు. ఇన్నాళ్లు గత 60 ఏళ్లుగా అదే పద్ధతి కొనసాగేది. కానీ మోడీ ప్రభుత్వ హయాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రణాళికల పద్ధతులను వదిలేసింది.. తెలంగాణ బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, వివిధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు ఈటల తెలిపారు..

* తెలంగాణ బడ్జెట్ 1,49,646 కోట్లు: హైలెట్స్ ఇవీ..

-రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,646 కోట్లు
-ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
-నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు
-మహిళా శిశు సంక్షేమం కోసం రూ. 1731 కోట్లు
-బీసీ సంక్షేమం కోసం రూ. 5,070 కోట్లు
-మైనార్టీ సంక్షేమం కోసం రూ. 1249 కోట్లు
-ఆసరా ఫించన్ల కోసం రూ. 5,330 కోట్లు
-బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు
-ఫీజు రియింబర్స్ మెంట్ కోసం రూ. 1939 కోట్లు
-చేనేత కార్మికుల కోసం రూ. 1200 కోట్లు
-చివరి విడత రైతుల రుణమాఫీకి రూ. 4000 కోట్లు

* వివిధ రంగాలకు కేటాయింపులు….
-ఇరిగేషన్ కు రూ. 26,652 కోట్లు
-విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు

*అభివృద్ది పనులకు…
-పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
-మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
-రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
-జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ. 30 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
-గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు

* ప్రభుత్వ రంగాలు, పథకాలకు..
-జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
-శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
-హరితహారానికి రూ. 50 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
-పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు

* కుల సంఘాలకు..
-ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు
-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు
-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు
-నిర్ణీత కాలానికి పథకాల వారీగా 3 నెలలకొకసారి నివేదిక సమర్పించాలి
-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం

* అభివృద్ధి వేగిరం..
-19.61 శాతం వృద్ధిరేటు సాధించాం
-రెవెన్యూ వృద్ధి గణనీయంగా పెరిగింది
-కేంద్రం ఆదేశాల మేరకు ఏకరీతిన బడ్జెట్ ను రూపొందించాం
-2017-18 బడ్జెట్ రూపకల్పనలో భిన్నపద్ధతులు అవలంభించాం
-రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం
-కొత్త నోట్ల రద్దుతో ఆదాయం తగ్గినప్పటికీ ఇతర పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది
-ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారు
-ప్రజల విశ్వాసానికి అనుగుణంగా నిలవాలని మా ప్రయత్నం
-ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైంది
-నాపై నమ్మకం ఉంచిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
– వరుసగా నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది

To Top

Send this to a friend