తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ విడుదల

– ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ
తెలంగాణ నిరుద్యోగుల పంట పండింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తీపి కబురు అందించింది. గురుకుల పాఠశాలల్లో ఏడువేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందుకోసం ఈ నెల 10 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. మొత్తం 7,306 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. గురుకుల నోటిఫికేషన్ గురించి గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఊరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నోటిఫికేషన్లో పొందుపరచాల్సిన నిబంధనలపై టీఎస్పీఎస్సీ, సంక్షేమశాఖలు ఇప్పటికే కసరత్తు చేసినట్టు సమాచారం. విద్యార్హతల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గురుకులాలు ఇంగ్లిషు మీడియం పాఠశాలలు అయినందున ఆంగ్ల మాధ్యమంలోనే చదివి ఉండాలన్న నిబంధన ఉంటుందా అనే ఆందోళన అనేక మంది అభ్యర్థుల్లో నెలకొన్న నేపథ్యంలో మీడియం విషయంలో ఆంక్షల్లేకుండా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్మీడియెట్ డిగ్రీ, పీజీ, బీఎడ్ వంటి కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో చదివినా, తెలుగు మీడియంలో చదివినా పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో టీజీటీ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరిగా టీఎస్పీఎస్సీ పేర్కొంది. 20శాతం వెయిటేజీ లెక్కిస్తారు.. టీజీటీ పోస్టులు 4362, పీజీటీ పోస్టులు 921, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 6, ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్ పోస్టులు 616., ఆర్ట్ టీచర్ 372, క్రాఫ్ట్ టీచర్ 43, మ్యూజిక్ టీచర్ 197, స్టాఫ్ నర్సు 533, లైబ్రేరియన్ 256 పోస్టులు ఉన్నట్టు ప్రకటన విడుదలైంది..

To Top

Send this to a friend