తెలంగాణలో హరీష్, ఏపీలో బీసీ నేత కొత్తపార్టీలు..


దాదాపు రూ.5000 వేల కోట్ల బడ్జెట్.. గోవా ఫార్ములా అమలు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ వేసిన ప్లాన్ ఇదీ.. ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ వ్యక్తి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు దిగ్గజ నేతలు కొత్త పార్టీలు పెట్టబోతున్నారనే వార్త సంచలనం రేపుతోంది..

*గోవానే స్ఫూర్తిగా ఉత్తరాది ప్లాన్
ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా సహకరించింది ఉత్తర భారతదేశమే.. అక్కడే బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, ఒడిషాల్లో బీజేపీ హవానే లేదు. అందుకే ఎలాగైనా సరే బీజేపీకి అధికారం కోసం మోడీ కొత్త ప్లాన్ చేశారు. బీజేపీ ఇక్కడ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమని భావించి గోవాలో అమలు చేసిన ప్లాన్ ను తెలుగు రాష్ట్రాలపై ప్రయోగించనుంది. గోవాలో బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కలిసి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి దాన్ని బీజేపీకి శత్రువుగా చూపించి గెలిచారు అనంతరం ఎన్నికల తర్వాత ఇదే గోమంతక్ పార్టీ బీజేపీ లో కలిసి అధికారం చేపట్టింది. అక్కడ ఈ ప్లాన్ విజయవంతం కావడంతో బీజేపీకి ఓట్లు పడని రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది..

* 5వేల కోట్లతో జూన్ లో కొత్త పార్టీలు..
బీజేపీకి మూలాలులేని రాష్ట్రాల్లో అధికారం సాధించడం కోసం మోడీ అండ్ బీజేపీ కసరత్తు చేస్తోంది. అందుకోసం అన్ని రాష్ట్రాల్లో కొత్త పార్టీలు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ పార్టీలను జూన్ లేదా జూలైలో ప్రకటిస్తారిన చెబుతున్నారు. ఇందుకోసం రూ.5వేల కోట్లు బీజేపీ రెడీ చేసిందట.. అంతేకాదు.. ఈ కొత్త పార్టీలకు ముహూర్తాన్ని ఖరారు చేయాల్సిందిగా సంచలన రాజకీయ జోషిత్యుడు వేణుస్వామిని బీజేపీ పెద్దలు సంప్రదించినట్టు తెలిసింది. ఎవరు గెలుపు గుర్రాలు, వారి జాతకాలు.. ఎవరిద్వారా అధికారం వస్తుందని ఆ పండితుడిని ఆరాతీస్తున్నారు.

*తెలంగాణలో హరీష్ రావు సారథ్యం..
దాదాపు 5వేల కోట్లు బడ్జెట్. దీంతో ఈ మొత్తంతో పాటు ఆకర్షనీయ నేత కోసం బీజేపీ పెద్దలు తెలంగాణలో వెతుకుతున్నారట.. ఇందుకోసం ఇప్పటికే టీఆర్ఎస్ లోని 40 మంది ఎమ్మెల్యలతో టచ్ లో ఉన్నారని సమాచారం. ఖచ్చితంగా గెలిచే నాయకులను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక మంత్రి హరీష్ రావుకు ఈ కొత్త పార్టీ బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నారట.. ఇప్పటికే కేసీఆర్ .. తన కొడుకు, మంత్రి కేటీఆర్ ను ఫోకస్ చేస్తూ అల్లుడు హరీష్ ను నామమాత్రం చేస్తున్నారు. దీంతో ఆ అసంతృప్తిని వాడుకొని కొత్త పార్టీ పెట్టించి హరీష్ ద్వారా తెలంగాణలో అధికారం సాధించాలని బీజేపీ పెద్దలు సంప్రదింపులు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కొత్త పార్టీ జూన్ 2న రాబోతున్నట్టు తెలిసింది.

*ఆంధ్రాలో బీసీ నేతతో కొత్త పార్టీ
తెలంగాణలో అగ్రకులమైన హరీష్ కు బాధ్యతలు అప్పజెప్పబోతున్న బీజేపీ .. ఏపీలో ఓ బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని కొత్త పార్టీ నాయకుడిగా ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు ఆయా రాష్ట్రాల్లో శక్తిమంతులుగా ఉన్నారట.. ఇప్పటికే వీరిద్దరి పొత్తుతో ఏపీ తెలంగాణల్లో పోటీ చేయాలని బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో రెండు సార్లు థానే, ఢిల్లీలో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఏపీలో ఎవరా బీసీ బలమైన నేత అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

* అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా కోసమే..
ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు కలిసే దేశంలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈ కొత్త ప్లాన్ చేసినట్టు సమాచారం. ఎక్కడెక్కడ బీజేపీ ఆధిపత్యం లేదో అక్కడ కొత్త పార్టీలు పెట్టించి ఓట్లను కొల్లగొట్టి.. భవిష్యత్తులో బీజేపీతో జతకట్టేలా ఆ పార్టీలను తయారు చేస్తున్నట్టు సమాచారం.ఈ మోడీ మాస్టర్ ప్లాన్ హిట్ అయితే ఇక దేశం కాషాయమయం కావడం ఖాయం. ఇదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీలు.. రాజకీయ కాక మొదలైనట్టే..

To Top

Send this to a friend