తెలంగాణలో ఒకే ఒరలో రెండు కత్తులా..?

టీడీపీ తమ్ముళ్లు సైడ్ మార్చారు. తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు కాళ్ల బేరానికి వచ్చారా..? తెలంగాణలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకప్పటి సీనియర్ టీడీపీ నేతను ఈ విషయంలో సంప్రదించారా.? ఆయన నేతృత్వంలో కేసీఆర్ తో టీడీపీ నేతలు భేటి అయ్యారా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తోంది.. తెలంగాణలో టీడీపీని బతికించుకునేందుకు తెలుగుదేశంలో పార్టీకి , నిజామాబాద్ కు చెందిన మాజీ మంత్రి, ఏపీ మంత్రి, టీడీపికి సన్నిహితులైన ఓ మీడియా బాస్ రంగంలోకి దిగినట్టు సమాచారం. వారు కేసీఆర్ తో భేటి అయి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-టీఆర్ఎస్ తో పొత్తుకు చొరవ చూపినట్టు తెలిసింది. రహస్యంగా జరిగిన ఈ సమావేశం వెలుగుచూడడంతో టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి.
తెలంగాణ మంత్రి తుమ్మల సంధితో టీడీపీ నేతలు-కేసీఆర్ ను కలిసి పొత్తుపెట్టుకునే అంశంపై చర్చించారు. అయితే ఇందులో రమణ సహా పెద్ద నేతలు ఇద్దరు ముగ్గురిని చేర్చుకునే విషయంలో కేసీఆర్ మోకాలడ్డుతున్నట్టు సమాచారం. ఈ పొత్తు పొడుస్తున్న కారణంగానే కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే టీడీడీ నేత రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్నారు.. పొత్తు కారణంగానే ఈ మద్య టీడీపీ నుంచి వలసలు తగ్గిపోయాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ, టీఆర్ఎస్ లు కలిసిపోవడమే ఒక సంచలనం.. అందునా ఒకప్పటి టీడీపీ నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ ను ఏలుతున్న దరిమిలా అంతా కలిసి తెలంగాణలో తిరుగులేకుండా చేసుకునే ప్లాన్ లో భాగంగానే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది.. ఈ కూటమి కలిస్తే ఒకే ఒరలో రెండు కత్తులైన కేసీఆర్, రేవంత్ లు ఉండే అవకాశం ఉంటుంది.. మరి దీనికి ఇద్దరు ఒప్పుకుంటారా.. లేదా అన్నది మున్ముందు తేలుతుంది.

To Top

Send this to a friend