తుమ్మలపై కేసీఆర్, బాబుల ప్రేమ..?


ఉప్పునిప్పులా ఉన్న సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు కలిసిపోవడానికి ప్రధాన కారకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గతంలో తుమ్మల, కేసీఆర్ లు చంద్రబాబు కిందే పనిచేశారు. ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి విభేదాలు పొడచూపాయి. అనంతరం కేసులు, కోర్టుల వరకు వెళ్లినా ఈ ఇద్దరి సీఎంల మధ్య సయోధ్య కుదిర్చింది మాత్రం మంత్రి తుమ్మలేనని టీఆర్ఎస్ వర్గాల్లో టాక్ ఉంది..

అంతేకాదు.. అప్పట్లో తెలంగాణలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ పై తెలంగాణలో నిషేధం ఎత్తివేయడంతో పాటు ఆ చానల్ ఎండీ రాధాకృష్ణ, సీఎం కేసీఆర్ కు మధ్య సయోధ్య కుదిర్చింది కూడా మంత్రి తుమ్మలేనని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్.. సీనియర్ కావడం.. రాజకీయాల్లో తలపండిన నేత.. కేంద్రంలో పరిచయాలు ఇవన్నీ కూడా తుమ్మలకు ప్లస్ గా ఉన్నాయి. అందుకే రాజకీయాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ముఖ్యంగా ఆంధ్రావాళ్లతో లొల్లి వస్తే సీఎం కేసీఆర్ మొదట సంప్రదించేది తుమ్మలనేననట.. అందుకే తుమ్మలను పిలిచి మరీ రహదారులు, మహిళా శిశు సంక్షేమం శాఖ అప్పగించారు కేసీఆర్..

ఇప్పుడు తుమ్మల కృషితో తెలంగాణకు జాతీయ రహదారుల హారం వరించింది. గడిచిన రెండేళ్ల క్రితం తెలంగాణలో జాతీయ రహదారుల వాటాలో దేశంలోనే 23వ స్థానంలో ఉండగా.. తుమ్మల కృషి వల్ల తెలంగాణకు దాదాపు 2500 కి.మీల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. దీనివల్ల ఇప్పుడు తెలంగాణ జాతీయ రహదారుల సగటులో దేశంలోనే 3వ స్థానంలో వచ్చింది. ఇదంతా తుమ్మల కృషినే.. అంతేకాదు.. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి ఆంధ్రాకు పలు జాతీయ రహదారులు ప్రకటించేలా కృషి చేశారట తుమ్మల.. సో ఇటు సీఎం కేసీఆర్ కు, అటు చంద్రబాబుకు సయోధ్య కుదర్చడమే కాదు.. తన పనితీరుతో ఇద్దరు సీఎంలను ఆకట్టుకుంటున్నారట.. అందుకే ఇప్పుడు ఇద్దరు సీఎంలకు తుమ్మల పై ఆవాజ్య ప్రేమ ఉంది.

To Top

Send this to a friend