తుపాకితో భార్యను కాల్చి.. ఎస్.ఐ కాల్చుకొని..


తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక లో దారుణం జరిగింది. దుబ్బాక ఎస్.ఐ చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్ తో భార్యను కాల్చి తాను కూడా కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఆయన భార్య అక్కడికక్కడే మృతిచెందింది.. చిట్టిబాబుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. చిట్టిబాబు దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు..

అయితే ఈ దారుణాలకు, భార్యభర్తల మధ్య మనస్పర్థలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్.ఐ చిట్టిబాబు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. దుబ్బాకలో పనిచేస్తున్న చిట్టిబాబును ఇటీవలే డిప్యూటేషన్ పై సిద్దిపేటకు బదిలీ చేశారు. ఈ వివాదమే భార్యభర్తల మధ్య గొడవలకు కారణమై ఈ దారుణాలకు పురిగొల్పాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend