తమిళ తంబీల దబిడ.. దిబిడే..

తమిళనాడు అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి ఫళినిస్వామికి ప్రతిపక్ష డీఎంకే ఊహించని షాక్ ఇచ్చింది. బలపరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ ధన్ పాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురు ఉన్న టేబుల్ ను విరగ్గొట్టి మైక్రోపన్లను విరిచేశారు. ఆయన కూర్చీని ఎత్తిపడేశారు. స్పీకర్ మీదకు కాగితాలు విసిరారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో డీఎంకే ఎమ్మెల్యేలు ఒప్పుకోక రణరంగం సృష్టించారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ చొక్కాను కూడా చింపేశారని సమాచారం..
అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేల ఆందోళనతో స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ ని మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేశారు. సభను వాయిదావేసిన కూడా డీఎంకే ఎమ్మెల్యేలు బయటకు పోకుండా అసెంబ్లీలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నారు. పన్నీర్ సెల్వం కూడా డీఎంకే సభ్యులతో కలిసి ఆందోళన చేయడం గమనార్హం. ప్రతిపక్ష డీఎంకేకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు కూడా కుర్చీలు ఎక్కి మరీ నిరసన తెలిపారు.  వారి తీరుకు నిరసనగా.. స్పీకర్ మొత్తం 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
To Top

Send this to a friend