తమిళ క్లైమాక్స్ : పళని సీఎం.? కాదా..?


తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస బలపరీక్ష జరగబోతోంది.. ఫళని స్వామికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు లేఖ అందించారు. మరి వారందరూ ఆయన వెంట నడుస్తారా..? లేదా..? మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఏమైనా అధికార అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలను లాక్కుంటారా అన్నది కొద్దిగంటల్లోనే తేలనుంది..
గవర్నర్ ఫళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఆయన వెంట 122 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక తిరుగుబాటు పన్నీర్ సెల్వం వెంట దాదాపు 10 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీ డీఎంకే కు 89 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ అధికార పార్టీ అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని తెలిపారు. దీంతో ఆయన పన్నీర్ కు వేస్తారా లేదా అన్నది కన్ ఫం కాలేదు.
ఇక ఈరోజు విశ్వాసపరీక్షలో అన్నాడీఎంకే పార్టీకి, సీఎం ఫళని స్వామికి షాక్ ఇచ్చారు కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్ .. ఆయన ఫళని స్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని.. పన్నీర్ సెల్వం వెంట నడిచారు. దీంతో రాజకీయాలు మలుపుతిరిగాయి. ఇలానే మరికొంత మంది కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు పలికితే ఫళనిస్వామి మ్యాజిక్ ఫిగర్ 117 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఉంటారా లేదా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ విశ్వాసపరీక్ష సమయానికి ఫళని స్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే తమిళనాడులో ప్రభుత్వం పడిపోవడం ఖాయం.. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎన్నికలా..? లేక రాష్ట్రపతి పాలన అన్నది గవర్నర్ డిసైడ్ చేస్తారు.. ఏ విషయం అనేది కొద్ది గంటల్లోనే తేలనుంది.

To Top

Send this to a friend