తమిళనాడు రాజకీయాల్లోకి రజినీకాంత్?

జయలలిత చనిపోయింది. అధికార అన్నాడీఎంకే ఆగమైంది. పన్నీర్ సెల్వం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిన్నమ్మ శశికళ పన్నీర్ సెల్వంను రాజీనామా చేయించి గద్దెనెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శశికళను వెంటాడుతున్న కేసుల భయం.. సుప్రీం కోర్టు… జయ, శిశకళ అక్రమాస్తుల కేసుపై తుది తీర్పునిస్తోంది. ఇంత హాట్ హాట్ పరిస్థితుల్లో తమిళ రాజకీయాలపై సూపర్ స్టార్ రజినీకాంత్ హాట్ కామెంట్లు చేశాడు.. తనకు అధికారమంటే ఇష్టమేనంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం తమిళనాట కలకలం రేపింది.
అధికార అన్నాడీఎంకే ఇప్పుడు చుక్కాని లేని నావలా ఉంది.. ఈ నేపథ్యంలో రజినీకాంత్ తనకు అధికారం అంటే ఇష్టమేనని.. కానీ ఆధ్యాత్మికం అంటే ఇంకా ఇష్టమని వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. శశికళ కూడా జైలు కెళితే అన్నాడీఎంకే పగ్గాలు రజినీ కాంత్ చేపట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. మరోవైపు రజినీకాంత్ ఈ కల్లోల తమిళ రాజకీయ పరిస్థితులను బేస్ చేసుకొని కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. రజినీకాంత్ పార్టీ పెడితే ఆయన అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతటి ప్రజాభిమానం ఆయన సొంతం..
కాగా మొదటినుంచి రజినీకి రాజకీయాలంటే అయిష్టత ఎక్కువ.. 20 ఏళ్లుగా ఆయనను రాజకీయాల్లోకి రమ్మని చాలామంది ఆహ్వానించినా రావడం లేదు. గత ఎన్నికల్లో మోడీ పిలిచి బీజేపీ పగ్గాలిస్తానని చెప్పినా తాను రాజకీయాల్లోకి రాను అని స్పష్టం చేశారట.. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

To Top

Send this to a friend