తమకూ ఓ కేసీఆర్ కావాలి: ఏపీ ప్రజలు

ఈ మధ్య చంద్రబాబు ఓ వ్యాఖ్య చేశారు,, ‘పార్లమెంటు డోర్లు బంద్ చేసి రాష్ట్రాన్ని విభజించారని.. ఏపీకి అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు…’ ఈ మాటలు ఇప్పుడు దుమారం రేపాయి.. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల చంద్రబాబు మాటలపై స్పందించారు. ఉమ్మడి రాష్ట్రం లక్షా 60వేల కోట్ల బడ్జెట్ పెట్టింది. కానీ ఏపీ తెలంగాణలు విడిపోయాక ఏపీ , తెలంగాణల మొత్తం బడ్జెట్ 2.61 లక్షల కోట్లు.. ఇంతలా రెండు రాష్ట్రాలు అభివృద్ది చెందాక కూడా ఏపీ ముఖ్యమంత్రి విద్వేశాలు రెచ్చగొడుతూ ఇలా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా సాధించలేని ఏపీ ప్రజల నిస్సహాయతను చూసి తమకూ ఓ కేసీఆర్ కావాలని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఈటెల వ్యాఖ్యానించారు.

చంద్రబాబు.. ఏపీ తెలంగాణ విడిపోయాక కూడా ఏదైనా సమయం సందర్భం దొరికితే తెలంగాణ అన్యాయంగా ఏర్పాటు చేశారని.. ఏపీకి మొండిచేయి చూపారని అంటున్నారు. ఏపీ ప్రజల్లోకి వెళితే ఆ పరిస్థితి లేదు. పరిపాలన వారికి చేరువైంది. వికేంద్రీకరణ జరిగింది.. ఉద్యోగాలు పెరిగాయి. పరిశ్రమలు జిల్లాలకు వస్తున్నాయి. కేంద్రం ఏ పథకం ప్రకటించినా ముందు ఏపీలోనే అమలు చేస్తున్నారు. ఎల్ ఈడీ బల్బులు, ఇంటర్నెట్ సహా ఎన్నో పథకాలు తెలంగాణకంటే ముందే ఏపీలో అమలవుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతున్నా బాబు కేవలం ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. కానీ నిజంగా ఏపీ ప్రజల్లో తెలంగాణపై ఎలాంటి ద్వేషభావం లేదు అనడానికి చాలా ఉదాహరణలున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అబద్దాలనడానికి కారణాలున్నాయి.

To Top

Send this to a friend