తన ఎత్తు 14 అంగుళాలు మాత్రమే: అంబటి

ఐదు నెలల క్రితం తన ఆస్తుల విలువ రూ. 14. 5 కోట్లుగా చెప్పిన లోకేష్… తాజాగా ఎమ్మెల్సీ నామినేషన్‌లో ఏకంగా 330 కోట్లలని వెల్లడించారు. దీంతో తెలుగు ప్రతికలతో పాటు పలు జాతీయ వార్తా పత్రికలు కూడా భారీగా కథనాలు రాశాయి. ఐదు నెలల్లో ఆస్తులు ఏకంగా 2178.20 శాతం ఎలా పెరిగాయని ప్రశ్నించాయి. దీంతో నారా లోకేష్ ప్రెస్‌మీట్‌ పెట్టి వివరణ ఇచ్చారు. ఆరేళ్లుగా తాను ప్రకటిస్తున్న ఆస్తుల విలువ ఇప్పటి మార్కెట్ ధరల ఆధారంగా వెల్లడించింది కాదన్నారు. 1992లో అప్పుడు షేర్లను ఎంతకు కొన్నామో ఆ ధర ఆధారంగానే ఆస్తుల విలువ ప్రకటించానని చెప్పారు. అందువల్లే ఐదు నెలల క్రితం ఆస్తుల విలువ 14.5 కోట్లు అని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌లో మాత్రం ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగానే ఆస్తులు ప్రకటించానన్నారు. అందుకే తన ఆస్తుల విలువ 330కోట్లకు పెరిగిందన్నారు. లోకేష్ సమాధానంతో విలేకర్లు అవక్కాయ్యారు. అంటే తాతల కాలంలో 100 రూపాయలు పెట్టి ఆస్తి కొని ఉంటే ఇప్పుడు కూడా ఆ ఆస్తి విలువ రూ. 100 అని చెప్పుకుంటూ తిరుగుతామా అని నవ్వుకున్నారు. చంద్రబాబు సీఎం అయిన సమయంలో హెరిటేజ్ షేర్లను తన పేరు మీద రాశారని లోకేష్ చెప్పారు. బ్రహ్మణికి జీతం కిందే రూ. 4 కోట్ల 20 లక్షలు వస్తోందన్నారు. అలా బాగా సంపాదిస్తున్న కుటుంబం తమది అని చెప్పారు. ఇప్పటికీ పాలు, కురగాయాలు అమ్ముకుని బతుకుతున్నకుటుంబం తమది అని చెప్పారు. సాక్షి పేపర్‌ను చదవొద్దని లోకేష్ సూచించారు. ఎమ్మెల్సీగా ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆరేళ్లుగా తాను ప్రకటిస్తున్న ఆస్తుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం కాదని… 1992 నాటి లెక్కల ఆధారంగా ఆస్తులు ప్రకటించినట్టు చెప్పారు.తాను ఎమ్మెల్సీగా వస్తుండటాన్ని తట్టుకోలేకే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

లోకేష్ ఇలా చెప్పడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఆస్తులు ప్రకటించకుండా ఎప్పుడో కొన్న సమయంలో వాటి విలువ ఆధారంగా ఆస్తుల లెక్కలు ప్రకటించడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ”లోకేష్‌ను ఎవరైనా నీ పొడవు ఎంత అని ప్రశ్నిస్తే… ఇప్పుడున్న పొడువు చెబుతారా లేదంటే పుట్టినప్పుడు 14 అంగుళాలు మాత్రమే ఉంటాడు కాబట్టి అదే తన ఎత్తు” అని లోకేష్ చెబుతారా అని నిలదీశారు. చట్టసభల్లోకి ప్రవేశకముందే తండ్రిని మించిన తనయుడిలాగా కళ్లార్పకుండా పచ్చి అబద్దాలు చెప్పడంతో నారా లోకేష్ ముదిరిపోయారని అంబటి విమర్శించారు. 2019లో జగన్‌ను ఓడిస్తా అంటున్న లోకేష్‌కు అంత ధైర్యమే ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా… దొడ్డిదారిలో ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి ఎందుకు చొరబడుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

To Top

Send this to a friend