తన ఇంట్లో వేధింపులా..: కేసీఆర్ సీరియస్


ఆయన స్వయానా తెలంగాణకు ముఖ్యమంత్రి.. పరిపాలనలో, రాజకీయాల్లో తిరుగులేదు. ఇంట్లో బయటా అంతటా స్ట్రిక్ట్ ఉంటాడు. కానీ తన ఇంట్లోనే ఇలా జరగడంపై ఆశ్చర్యపోయారు. సీరియస్ గా స్పందించి అధికారిని వెంటనే తప్పించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎక్కడ బయటికి రాలేదు. కానీ తెలంగాణ సీఎం కార్యాలయంలో జరిగిన ఈ విషయం ఆ నోటా ఈనోటా తెలిసి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
సీఎం క్యాంప్ కార్యాలయం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ అధికారి క్యాంప్ ఆఫీసులోనే పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని కొద్దికాలంగా వేధిస్తున్నాడట.. ఆయన వేధింపులు తగ్గకపోవడంతో ఆ మహిళా ఉద్యోగా ఏకంగా కేసీఆర్ చెంతకే వెళ్లి తనకు జరుగుతున్న వేధింపులపై బోరు మన్నదట.. ఇది విని విస్మయానికి గురి అయిన కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. డీఎస్పీ హోదాలో ఉన్న సదరు అధికారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా సీన్లోకి వచ్చిన తర్వాత చర్యలు వాయువేగంతో జరిగిపోయినట్లుగా తెలుస్తోంది..
మహిళా ఉద్యోగిని వేధించిన సదురు పోలీస్ అధికారిని సీఎం కార్యాలయం నుంచి వెంటనే బదిలీ చేయడమే కాకుండా ఆయనపై విచారణ కూడా పై అధికారులు మొదలుపెట్టారట.. కాగా మహిళా ఉద్యోగి పోలీసులకు మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదు. సీఎంకే ఫిర్యాదు చేయడం.. ఆయన చర్యలకు ఆదేశించడంతో ఇది బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్తగా విచారణ చేస్తున్నట్టు సమాచారం.

To Top

Send this to a friend