డిసెంబ‌ర్ 30న కారందోశ‌

karam-2
వీణా వేదిక  ప‌తాకం నిర్మిస్తున్న చిత్రం `కారందోశ‌`.  శివ రామ‌చంద్ర‌వ‌రపు, సూర్య శ్రీనివాస్‌, చంద‌న రాజ్ ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి గాజుల‌ప‌ల్లి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకున్న సినిమా డిసెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.  ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశంలో చిత్ర నిర్మాత మాట్లాడుతూ  “మా బ్యాన‌ర్ లో తొలి సినిమా ఇది. ప్ర‌తీ  ఒక్క‌రూ క‌ల‌లు కంటుంటారు. అయితే క‌ల‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేసేది మాత్రం కొంద‌రే. అందుకు వారెంతో క‌ష్ట‌ప‌డ‌తారు. అలాంటి క‌ష్టాన్ని న‌మ్ముకున్న కొంత మంది యువతీయువ‌కులు త‌మ గ‌మ్యాన్ని ఎలా చేరుకున్నార‌నే క‌థాంశంను వినోదాత్మ‌కంగా, సందేశం జోడించి కారందోశ‌గా చిత్రీక‌రించాం. సినిమా క‌డ‌ప బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఎక్కువ భాగం షూటింగ్ అక్క‌డే జ‌రిగింది. సెన్సార్ టీమ్ యు స‌ర్టిఫికెట్ ఇచ్చింది. డిసెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం.  ఈ  చిత్రాన్ని త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళంలో కూడా డ‌బ్ చేసి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం ` అని అన్నారు.
హీరో  సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ “ చ‌క్కని క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని ఆశిస్తున్నాం` అని అన్నారు.
హీరోయిన్ చంద‌న రాజ్ మాట్లాడుతూ “ ఇందులో క‌ల‌ర్ రాని చంద‌న‌గా క‌నిపిస్తా. ప్రతీ ఒక్క‌రు ఏదో చేయాల‌నుకుంటారు. కానీ ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటి పాయింట్స్ ను ఈ చిత్రంలో డిస్క‌స్ చేశాం. సినిమా బాగా వ‌చ్చింది` అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో కాశీ విశ్వ‌నాథ్, వీర‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో  వంకాయ‌ల స‌త్య‌నారాయ‌ణ‌, కాశీ విశ్వ‌నాథ్, శివ‌రామ చంద్ర‌వ‌ర‌పు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:  రాజా భ‌ట్టాచార్జీ, సంగీతం:  సిద్ధార్థ్ వాకిన్స్, ఎడిటింగ్:  సురేష్‌, క‌థ‌, మాట‌లు, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: గాజుల‌ప‌ల్లి త్రివిక్ర‌మ్
To Top

Send this to a friend