డిసెంబర్ 30న  జీవా-కాజల్  “ఎంతవరకు ఈ ప్రేమ”

4
`రంగం` సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కావలై వేండాం` తెలుగులో `ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ‌` టైటిల్ తో డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ అందిస్తున్నారు. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హిస్తున్నారు. సెన్సార్ కంప్లీట్ చెసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈనెల 30న  ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.
ఈ సంద‌ర్భంగా  డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ మాట్లాడుతూ “రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాట‌ల‌కు  యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ పై చిత్రీక‌రించిన  గ్లామ‌ర్ స‌న్నివేశాలు యూత్ ను వీప‌రీతంగా  ఆక‌ట్టుకుంటాయి. ఇప్ప‌టికే ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతో ఆ ఫాలోయింగ్ మ‌రింత రెట్టింపు అవుతుంది.  ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోవ‌డం కోసం ట‌ఫ్ పోటీ ఎదురైన‌ప్ప‌టికీ ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. తమిళ్ తో పాటు తెలుగులో సైతం ఒకెసారి విడుదల చెయాలనుకున్నా,  సమయానికి తెలుగు  సెన్సార్ అవ్వక పోవటంతొ తెలుగు వెర్షన్ రిలీజ్ లేటయింది.   ఈ రోజు సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.  డిసెంబ‌ర్ 30న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చెస్తున్నాము.  `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా త‌మిళంలో నిర్మించటం విశేషమని  అన్నారు.
ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్..
To Top

Send this to a friend