డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విశాల్‌ ‘ఒక్కడొచ్చాడు’

01-2

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ”లవ్‌, యాక్షన్‌, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. తమన్నాతో మొదటిసారి కలిసి వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. సురాజ్‌తో తొలిసారి చేసిన సినిమా. దర్శకుడుగా ఇలాగే చేయాలనే ఈగో ఏమీ పెట్టుకోకుండా అందరి సలహాలు వింటూ అందులో మంచి సలహా తీసుకుంటూ సినిమాను ఓ టీమ్‌గా చేశాం. సినిమా బాగా రావాలని టీం అంతా కష్టపడ్డాం. వడివేలుగారు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఎంట్రీ ఇస్తున్నారు. సమాజంలోని ప్రతి మనిషి మైండ్‌కు ఓ వాయిస్‌ ఉంటుంది. ఆ మైండ్‌వాయిస్‌తో ఈ సినిమాలో మాట్లాడే అవకాశం వచ్చింది. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఓ విషయం చెబుతున్నాను. అది ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుంది. హిప్‌ హాప్‌ తమిళ అద్భుతమైన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. ఈ సినిమా నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
మిల్కీబ్యూటీ తమన్నా మాట్లాడుతూ – ”విశాల్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా ఈ సినిమా రూపొందింది. నిర్మాత హరిగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నేను ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశాను. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న ఈ క్యారెక్టర్‌ను చెయ్యడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. డిసెంబర్‌ 23న విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు సురాజ్‌ మాట్లాడుతూ – ”ఇది ఒక స్టైలిష్‌ ఎంటర్‌టైనర్‌. విశాల్‌గారి పెర్‌ఫార్మెన్స్‌, తమన్నా డాన్స్‌ అందర్నీ అలరిస్తుంది. జగపతిబాబుగారు ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించారు. హిప్‌హాప్‌ తమిళ మ్యూజిక్‌ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సూపర్‌గా చేశారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ‘ఒక్కడొచ్చాడు’ ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది” అన్నారు.
నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా రూపొందిన ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాన్ని డిసెంబర్‌ 23న విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ ఈ చిత్రంలోని పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విశాల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు చెయ్యని ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఈ చిత్రంలో చేశారు. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది” అన్నారు.
పాటల రచయిత డా.చల్లా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ – ”ఈ సినిమాలోని పాటలన్నీ రాసే అవకాశం ఇచ్చిన నిర్మాత హరిగారికి, హీరో విశాల్‌గారికి కృతజ్ఞతలు. హిప్‌ హాప్‌ తమిళ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. డిసెంబర్‌ 23న విడుదలవుతున్న ఈ సినిమా విశాల్‌గారి కెరీర్‌లోనే పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.
విశాల్‌, తమన్నా, ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె. సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహ నిర్మాత: ఇ.కె. ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

To Top

Send this to a friend