డా॥ పి.ఎం. సుందరరావు ‘మహాత్మా జోతిరావుఫూలే’ ఫస్ట్‌లుక్!

 dsc_5392
చెలిమి విజన్‌ పతాకంపై డా॥ పి.ఎం. సుందరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహాత్మా జోతిరావుఫూలే’. నవంబర్‌ చివరి వారంలో విడుదల‌ కానున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను సీనియర్‌ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…“ తెలుగులో  మొదటిసారిగా పూలే జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. ప్రేక్షకులు  ఆదరించాల‌న్నారు.
చిత్ర దర్శక నిర్మాత పి.ఎం. సుందరరావు మాట్లాడుతూ… ‘సమాజంలోని అసమానతల్ని తొల‌గించి స్త్రీ విద్య వ్యాప్తికి కృషిచేసిన గొప్ప మహనీయుడు జోతిరావుఫూలే. ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన అరవై మంది రంగస్ధల‌ కళాకారులు ఈ చిత్రంలో నటించారు. ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు  కూడా ల‌భిస్తాయన్న నమ్మకం వుంది. సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తి చేసి నవంబర్‌ చివరి వారంలో  సినిమా విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో   ఎడిట‌ర్  టి.మహేష్‌ కూడా పాల్గొని  గొప్ప వ్య‌క్తి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ప‌ని చేయ‌డం సంతృప్తిక‌రంగా ఉంద‌న్నారు.
 పి.ఎం. సుందరరావు, బెల్లంకొండ‌ వెంకట్‌, ఎం.ఎస్‌. చార్లీ, అయినాల‌ మల్లేశ్వరరావు, సోను, విఠల్‌ ప్రసాద్‌, యోహాన్‌, మిల‌టరీ ప్రసాద్‌, చిలువూరు నాగేశ్వరరావు, విజయల‌క్ష్మి, దుర్గ, మీనాక్షి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.ల‌క్ష్మణ్‌, సంగీతం:  కరుణాకర్‌, ఎడిటింగ్‌: మహేష్‌ తుపాకుల.
To Top

Send this to a friend