డబ్బుల్లేవని ఎవరన్నారు.. తాగడానికి మాత్రం పెట్టేశారు..

newyear-party-india-apnewsonline

పెద్దనోట్ల రద్దు చేసి ఇప్పటికి 50 రోజులు దాటింది.. ఏటీఎంలు, బ్యాంకుల్లో జనం అవస్థలు పడ్డారు. కానీ ఇవేవీ నూతన సంవత్సర వేడుకలకు అడ్డుకాలేదు.. ఈ సంవత్సరం ఎక్సైజ్ ఆదాయం ఏమాత్రం తగ్గలేదు.. నూతన సంవత్సర వేడుకల్లో జనం తెగ తాగేశారు.. అర్ధరాత్రి వరకు బార్లు, వైన్ షాపుల ముందు క్యూలు కట్టారు. నూతన సంవత్సరం వేళ తాగి తూగి సంబరాలు చేసుకున్నారు..
తెలంగాణ సర్కారు కూడా పెద్దనోట్ల రద్దు .. తగ్గిన ఎక్సైజ్ ఆదాయానికి తగ్గట్టు వైన్ షాపులను రాత్రి 12 గంటల వరకు, బార్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. దీంతో డిసెంబర్ 31న ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.74 కోట్ల మద్యం అమ్మకాలు జరిగి రికార్డు నమోదైంది.. గత సంవత్సరం మొత్తంలో మద్యం అమ్మకాలు 1200 కోట్లు కాగా.. ఈ సంవత్సరం 1300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున నోట్ల రద్దు, నగదు కొరత ఉన్నా కూడా జనం మద్యానికి గతేడాదితో పోల్చితే 100 కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టడం గమనార్హం. అందుకే జనం దగ్గర డబ్బుల్లేవన్నది కేవలం మన అపోహ మాత్రమేనని ఈ మద్యం అమ్మకాలను చూస్తే తెలిసిపోతోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు..

To Top

Send this to a friend