ట్రంప్ యాంకర్.. హీరో అమెరికా అధ్యక్షుడు!

టిట్ ఫర్ టాట్.. అంటే ఇదే.. ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రరాజ్యాధినేత ట్రంప్ కు ఉన్న నోటి దురుసు వల్ల ఆయన గౌరవం రోజురోజుకు తగ్గిపోతోంది. అమెరికాలోని మెజార్టీ ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న అధ్యక్షుడికి వ్యతిరేకంగానే ఉద్యమించడం కన్న దారుణం ఇంకొకటి ఉండదు.. కానీ ట్రంపే వారికి అధ్యక్షుడు అందుకే భరించాల్సిందే. ఇప్పుడు ట్రంపే వారికి ఏకు మేకు అయ్యాడు..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్ చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అమెరికాతో పాటు ప్రపంచదేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయినా తాను హామీ ఇచ్చిన మేరకు నిర్ణయాలను అమలు చేస్తున్నారు. దాంతో పాటు తనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై ప్రతికార చర్యలకు దిగుతున్నారు.. ఇప్పుడు ప్రజలు, సెలబ్రెటీల దృష్టిలో ట్రంప్ విలన్ అయ్యాడు..
ఇటీవల ఓ కార్యక్రమంలో ట్రంప్.. తాను గతంలో యాంకర్ గా పనిచేసిన ‘ద న్యూ సెలబ్రిటీ అప్రెంటీస్’ అనే టీవీ రియాల్టీ షో గురించి వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం ఆ షోను ప్రముఖ హాలీవుడ్ హీరో అర్నాల్డ్ షార్ట్ నెగ్గర్ నిర్వహిస్తున్నారు.. దానిపై ట్రంప్ విమర్శలు గుప్పించారు.. ‘ఓ పేద్ద సినిమా స్టార్ ప్రస్తుతం తన స్థానంలో షోను నిర్వహిస్తున్నారని.. అయితే తన అంత రేటింగ్ రావడం లేదని.. బాగా పడిపోయిందని..’ ఎగతాళిగా హీరో షార్జ్ నెగ్గర్ గురించి మాట్లాడారు. ఓ అధ్యక్షుడు ఇలా దిగజారి హీరోను కామెంట్ చేయడంతో హీరో ఊరుకుంటాడా ఆయన నోటికి పనిచెప్పాడు..
షార్ట్ నెగ్గర్ ట్విట్టర్ లో ట్రంప్ పై విరుచుకుపడ్డారు.. ‘రేటింగ్ లో నిపుణులు కాబట్టి మీరు షో బాధ్యతలు తీసుకోండి.. మీ (అమెరికా అధ్యక్ష) స్థానంలోకి నేను వస్తా.. అప్పుడు ప్రజలు సుఖంగా నిద్రపోతారు’ అని ట్వీట్ చేశారు. ఇలా అమెరికా అధ్యక్షుడి ఏకపక్ష ధోరణితో విసిగిన అమెరికన్లకు నిద్ర కరువైందని.. ఆ హీరో ట్రంప్ కు ట్వీట్ తో మాంచి చురకనంటించారు.

To Top

Send this to a friend