టెక్నాలజీ బాబు.. జగన్ బేజారు..

ఏపీ అసెంబ్లీలో అందరిలోనూ కన్ఫూజన్.. లేచి నిలబడి మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష నాయకుడు జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకటే చింత.. అసలు మేం మాట్లాడేది జనాలకు వినపడుతుంతా.. మైక్ ఆన్ అయ్యిందా… ఏదీ తెలియక జగన్ తో సహా ఎమ్మెల్యేలు కన్ఫూజ్ అయ్యారు..

ఏపీ అసెంబ్లీలో మైక్ లు ఏర్పాటు చేయలేదు. కొత్త పరిజ్ఞానం సాయంతో సెన్సార్ల తో కూడిన మైకులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు లేచి నిలబడగానే వారి టేబుల్ పై ఉంచిన సెన్సర్లు ఆన్ అయ్యి మైక్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి. దీని నియంత్రణ స్పీకర్ దగ్గర ఉంటుంది.. ఈ కొత్త పరిజ్ఞానంతో మైక్ లు విరగ్గొట్టడం ఇక ఏపీ అసెంబ్లీలో మనం చూడలేం.. అంతా సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్ మైక్ లతోనే మాట్లాడాలి.. ఈ కొత్త పరిజ్ఞానంపై అందరూ కన్ఫూజ్ అయ్యారు.

ఈ కొత్త పరిజ్ఞానంపై ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ కూడా అయోమయం చెందారు. ఈ సందర్భంగా జగన్ కొత్త అసెంబ్లీలో మాట్లాడుతూ ‘పాత అసెంబ్లీలో కనీసం మైక్ ఆన్ అయితే తెలిసేదని.. ఇప్పుడు అది కూడా లేదని .. మేం లేస్తే మైకులు ఆన్ అవుతున్నాయా.. లేదా.. అనేది తెలియడం లేదని.. ఏం కొత్త టెక్నాలజీయో అని జగన్ విసుర్లు కురిపించారు. దీంతో సభలో మొత్తం నవ్వులు విరిశాయి..

To Top

Send this to a friend