టెంకాయ కొట్టు.. బాబు బుద్ది మార్చు డేవుడా

 

తుని కాపు ఐక్య గర్జన జరిగి నేటికి సంవత్సరం పూర్తయ్యింది. సరిగ్గా పోయినేడాది జనవరి 30న కాపు మహాగర్జన జరగడం.. అది విధ్వంసపూరితం కావడం.. చంద్రబాబు మోసానికి కడుపుమండిన కాపులు రైల్వేస్టేషన్, పొలీస్టేషన్ ను దహించేయడం ఇలా పెద్ద ఆందోళన జరిగి నేటికి సంవత్సర మైంది.. అయినా అప్పటి కాపుల ఉద్యమ ఫలాలు నేటికి అందలేదు.. బాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేవు..

చంద్రబాబు.. ఎన్నికలకు ముందు కాపులను భలే వాడుకున్నాడు. గెలిచాక కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చాడు. దీంతో ఏపీలో ఎక్కువ శాతం ఉన్న కాపులందరూ వైఎస్ జగన్ ను కాదని చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించారు. గద్దెనెక్కాక బాబు నాలుక మడతేశాడు. దీంతో కడుపు మండిన కాపులంతా తునిలో ఐక్యగర్జన మహాసభ పెట్టుకొని బాబు చేసిన మోసానికి రగిలిపోయి ఉద్యమాన్ని ఆందోళనగా మార్చి బాబు సర్కారుపై యుద్ధానికి దిగారు. అది జరిగి నేటి ఏడాది అవుతున్న పాపం కాపుల కోరిక నెరవేరలేదు.. బాబు మాట అమలు కాలేదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ దీక్షలకు దిగితే గృహనిర్బంధాలు, అరెస్ట్ లు చేసి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాడు..కాపులు ఆందోళన చేస్తే కమీటీలంటూ కాలయాపన చేశాడు

అందుకే ఈరోజును పురస్కరించుకొని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తుని ఐక్య గర్జన జరిగి నేటి ఏడాది అవుతున్నా హామీలు అమలు చేయని బాబు వైఖరికి నిరసనగా.. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కాపు సోదరులంతా అందుబాటులో ఉన్న దేవాలయాలకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి .. బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని  కోరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రకమైనా నిరసనతోనైనా కనీసం దేవుడైనా విని బాబు మనసు మార్చుతాడేమోనని ముద్రగడ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇలా కాపుల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వారి కోరికలు మాత్రం ఇప్పటికీ నెరవేరడం లేదు

To Top

Send this to a friend