టీట్వంటీలో ట్రిపుల్ సెంచరీ.. మోహిత్ కు గొప్ప ఆఫర్

ఒక్క టీట్వంటీ అతడి జీవితాన్నే మార్చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించి ఓ క్లబ్ క్రికెట్ లో మోహిత్ అహ్లావత్ అనే కుర్రాడు టీట్వంటీలో ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కేవలం 72 బంతుల్లో 300 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. దీంతో అతడిపై దేశవ్యాప్తంగా దృష్టిపడింది. ఇంత అద్భుతంగా ఆడిన మోహిత్ కు లక్కీ చాన్స్ వచ్చింది.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ డేర్ డెవిల్స్ .. ఈ ఢిల్లీ కుర్రాడి ప్రతిభను గుర్తించి అతడిని జట్టులోకి తీసుకునేందుకు ముందుకొచ్చింది. కోచ్ సంజయ్ భరద్వాజ్ ను కలవమని ఆదేశించింది. అతడి పర్యవేక్షణలో శిక్షణ తీసుకోవాలని వచ్చే ఐపీఎల్ సీజన్ కు సిద్ధం కావాలని సూచించింది. ట్రయల్స్ లో మోహిత్ రాణిస్తే ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కు జట్టులో ఆడే అవకాశం దక్కుతుంది. జాతీయ జట్టులోకి రావడానికి అవకాశం చిక్కుతుంది.
కాగా కోచ్ సంజయ్ ఆధ్వర్యంలో ఇప్పటికే శిక్షణ తీసుకున్న గౌతమ్ గంభీర్, ఉన్మక్త్ చంద్ లు జాతీయ జట్టుకు ఆడారు. అతడు మంచి కోచ్ గా పేరొందాడు. ఒకవేళ మోహిత్ కూడా కోచ్ శిక్షణలో రాటుదేలితే మరో మంచి క్రికెటర్ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 72 బంతుల్లో టీట్వంటీలో ట్రిపుల్ సాధించిన మోహిత్ ప్రతిభ ను అలాగే కొనసాగిస్తే అతడి భవిష్యత్ కు తిరుగుండదని ఢిల్లీ డేర్ డెవిల్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

To Top

Send this to a friend