టీటీడీపీ బాధ్యతలా నో.. లోకేష్ భవిష్యత్ ఏపీకే..

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తన కొడుకు.. కాబోయే నాయకుడు లోకేష్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఓ వైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కు ఇప్పటికే మంత్రి పదవి ఇచ్చి.. ప్రచార బాధ్యతలు అప్పగించి వీలైతే సీఎం పగ్గాలు అప్పజెప్పేందుకు అన్ని ట్రైనింగ్ లు ఇస్తుండగా.. ఈ విషయంలో సీఎం చంద్రబాబు బాగా వెనుకబడ్డారు. ఇంకా తన హయాంలోనే అంతా నడిపిస్తున్నారు..

లోకేష్ కు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పజెప్పి ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణలు గురువారం సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారట.. ఈ సమావేశంలో లోకేష్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించేది లేదని బాబు స్పష్సం చేశారట.. లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వాలనకుంటున్నానని.. త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకొని కీలక బాధ్యతలు అప్పగిస్తానని బాబు చెప్పినట్టు టీటీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో లోకేష్ తెలంగాణ బాధ్యతలు అటకెక్కినట్టేనని వాపోయారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న చంద్రబాబు.. అక్కడ లోకేష్ ను ఫోకస్ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని అర్థమైంది. అందుకే లోకేష్ ను బాబు ఏపీ రాజకీయాల్లోనే క్రియాశీలకంగా మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. టీటీడీపీ నావ తెలంగాణ మునిగిపోయినట్టేనని.. ఇక ఇప్పట్లో అక్కడ కేసీఆర్ ను తట్టుకొని నిలబడే దమ్ము టీడీపీకి లేదని బాబు అంచనా వేశారట.. అందుకే కొడుకు భవిష్యత్ ను నాశనం చేసేకంటే ఏపీలో కీరోల్ లో పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం..

To Top

Send this to a friend