టాలీవుడ్ ఇండస్ట్రీ @ చైన్నై వయా హైదరాబాద్ టు ఆంధ్రా

సినిమాను ఎంత గొప్పగా తీశామన్నది ముఖ్యం కాదు.. ఆ తీసిన సినిమాను ఎంత గొప్పగా ప్రచారం చేసుకున్నామన్నదే లెక్కా.. ఎంతా బాగా తీసినా జనంలోకి విస్తృతంగా తీసుకెల్లనిదే ఆ సినిమాను ఎవరూ చూడరు.. బాహుబలికి వందల కోట్లు పెట్టిన రాజమౌళి ప్రచారంలో ఎంత పకడ్బందీగా ముందుకెళ్లి, హిందీ తమిళ, తెలుగు, ఇతర భాషల్లో క్రేజ్ ను సృష్టించారు.. ఆ ప్రచారంతోనే బాహుబలి కోట్లు కొల్లగొట్టింది.. మరీ ప్రచారానికి ముందు సినిమా పూర్తి అయ్యాక ప్రధానంగా జరిగేది ఆడియో పండుగలే.. ఈ పండుగలను ఎంత బాగా చేస్తే ఆ సినిమాకు అంత ప్లస్ అవుతాయి.. కానీ టాలీవుడ్ ప్రస్తుతం సినిమా పండుగలు చేసుకోవడానికి నిర్మాతలకు ఆయా హీరోలకు చాలా కష్టంగా మారింది..
తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ లో సినిమా ఫంక్షన్లకు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు.. గోపాల గోపాల సినిమా ఆడియో వేడుకలో జరిగిన కత్తిపోట్లను సాకుగా చూపి బాహుబలి ఆడియో ఫంక్షన్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో ఎంతో గ్రాండ్ గా హైదరాబాద్ లో ఆడియో వేడుక చేద్దామన్న బాహుబలి నిర్మాతలు, రాజమౌళి ఆశలు అడియాశలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా బాహుబలి వేడుక జరగాల్సి ఉన్నా గతి లేని పరిస్థితుల్లో తిరుపతి చప్పాగా ఆ వేడుక జరిగిపోయింది. ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి కి కూడా హైదరాబాద్ లో వేడుక చేద్దామనుకున్నారట.. కానీ పోలీసు పర్మిషన్, వివిధ కారణాలు, అభిమానుల తాకి డి దృష్టా తిరుపతికి షిప్ట్ అయిపోయింది. పైగా చంద్రబాబు, వెంకయ్యలు చీఫ్ గెస్ట్ లు కావడం కూడా హైదరాబాద్ లో ఆడియో వేడుక జరగపోవడానికి ఒక కారణం..
కాగా ఎంత కాదనుకున్నా చైన్నై నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ కు రావడానికి కొన్నేళ్లు పట్టింది. ఇక్కడే అందరూ టాలీవుడ్ ప్రముఖులు సెటిల్ అయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆందోళన, అభద్రత దృష్టా సినిమా వేడుకలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వేడుకులు విజయవాడ, తిరుపతి తరలిపోతున్నాయి. చిరంజీవి ఖైది నెంబర్ 150 మూవీ ఆడియో వేడుక కూడా విజయవాడలో జరుపుతుండడం గమనార్హం.. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఆంక్షలు సడలిస్తే సినీ పరిశ్రమ గట్టెక్కుతుంది.. లేదంటే చైన్నై వయా హైదరాబాద్ టు ఆంధ్రాకు షిఫ్ట్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది..

To Top

Send this to a friend