టార్గెట్ 2.0, బాహుబలికి అందుకే పెంచేశారు..?


ముంబైలో బాహుబలి హిందీ వెర్షన్ రిలీజ్ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ ఓ పెద్ద విషయాన్ని రిలీజ్ చేశాడు. అదే బాహుబలి రెండు పార్టులకు కలిపి మొత్తం బడ్జెట్ రూ.450 కోట్లు  అయ్యిందని చెప్పాడు. మొదటిపార్టుకు 250 కోట్లు అని చెప్పిన బాహుబలి నిర్మాత.. ఆ తర్వాత మరో 200 కోట్లు పెంచడం సంచలనం అయ్యింది. అయితే బాహుబలి1 సినిమా అప్పుడే రెండో పార్టు 60శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని రాజమౌళి చెప్పాడు. మరి మరో 200 కోట్లు ఎలా ఖర్చయ్యాయన్నది చెప్పడం నమ్మశక్యంగా ఉంది..

అయితే కొద్దిరోజుల క్రితం బాహుబలి నిర్మాతలు, టీంపై ఐటీ దాడులు జరిగాయి. అందులో కొన్ని లెక్కలు చెప్పాలని ప్రశ్నించారట.. అందుకే ఈసారి వచ్చే లాభాలకు ఐటీ కట్టాల్సి వస్తుందనే సాకుతోనే బాహుబలి నిర్మాత సినిమా బడ్జెట్ ను రెండింతలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా బాహుబలి నిర్మాత శోభు బడ్జెట్ ను ఎక్కవ చేసి చూపడంలో కూడా టెక్నిక్ పోటీ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలికి పోటీగా ఇండియన్ తెరపై తమిళ అగ్రదర్శకుడు శంకర్ రోబో 2.0ను తీస్తున్నారు. ఈ సినిమా దాదాపు 350కోట్ల వ్యయంతో తెరకెక్కుతోంది. అంటే ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ సినిమా. అందుకే ఆ క్రిడిట్ ను వారికి సొంతం చేయడం ఇష్టం లేకే బాహుబలి నిర్మాత శోభు బడ్జెట్ ను 450కోట్లు గా చూపాడని భావిస్తున్నారు. ఇండియాలో అత్యధిక బడ్జెట్ మూవీ తమదే కావాలని.. 2.0ను వెనక్కినెట్టాలనే బాహుబలి టీం ఇలా వ్యూహాత్మకంగా బడ్జెట్ పెంచేసిందనే గుసగుసలు వినపడుతున్నాయి.

To Top

Send this to a friend