టాప్ హీరోల సినిమాలకు కావలెను..!

టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య తో పాటు చాలామంది హీరోలదీ అదే సమస్య.. మొత్తంగా టాలీవుడ్ కే ఇదో పెద్ద సమస్యగా మారింది.. అదే సినిమాలు పట్టాలెక్కుతున్నాయి కానీ ఆ చిత్రాలకు పేర్లే పెద్ద సమస్యగా మారాయి. కొందరు హీరోలు బయట నుంచి కథలను అరువుతెచ్చుకుంటున్నా ఆ సినిమా  పేర్లను డిసైడ్ చేయడం చాలా కష్టంగా మారింది.. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా.. వాళ్లని ఆకర్షించేలా టైటిల్ పెట్టడం కత్తిమీద సాములా మారింది. చిరంజీవి తన 150 వ సినిమాగా తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను ఎంచుకున్నారు. కానీ షూటింగ్ అయిపోవచ్చినా కూడా ఆ సినిమా పేరు విషయంలో సందిగ్ధం వెంటాడింది. చివరకు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు చిరు 150 వ చిత్రం స్ఫురణకు వచ్చేలా ఖైదీ నంబర్ 150 సూచించడం తో ఆ చిత్రం టైటిల్ కష్టాలు తీరాయి. ఈ కష్టాలు చిరు సినిమాకే కాదు ప్రస్తుతం సినిమాలకు అదే పరిస్థితి నెలకొంది..

మురగదాసు తెలుగు తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీస్తున్న సినిమాకు టైటిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ పోలీస్ గా నటిస్తున్నారు. దానికి కనెక్ట్ అయ్యేలా ఏజెంట్ శివ అనుకున్నారు. ఆ తర్వాత సంభవామి పేరును పరిశీలించినా అది ఒకే కాలేదు.. దీంతో మహేశ్ సినిమా పూర్తికావస్తున్నా పేరు దొరకక వారు కష్టాలు పడుతున్నారు. ఇక ఈ సమస్య వీరికే కాదు.. క్రియేటివిటీకి మారుపేరుగా.. టైటిల్స్ తోనే అట్రాక్ట్ చేసే సుకుమార్ కు వచ్చింది.. నాన్నకు ప్రేమతో..  1,  కుమారి 21ఎఫ్ లాంటి విభిన్న టైటిల్స్ తో దూసుకెళ్లే సుకుమార్ కూడా రాంచరణ్ తో ప్రస్తుతం తీస్తున్న సినిమాను టైటిల్ లేకుండానే ఓపెనింగ్ చేశాడు. ఆ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలోనే సాగే ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగాడుగా రాంచరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు రేపల్లెలో గోపాలుడు, పల్లెటూరి మొనగాడు అనే పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిపినా ఇంకా కన్ఫమ్ కాలేదు.  ఇక ఎన్టీఆర్ హీరోగా బాబి దర్వకత్వంలో రూపొందుతున్న సినిమాకు టైటిల్ వెతుకుతున్నారు. దీనికి జై లవకుశ పరిశీలిస్తున్నారట.. ఇక నాగచైతన్యతో సినిమాను స్టార్ట్ చేసిన కల్యాణ్ క్రిష్ణ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండడంతో ‘కళ్యాణం’ అనేపేరును పరిశీలిస్తున్నారట.. కానీ ఇందులో ఏ టైటిల్ కూడా ఇప్పటివరకు ఆ సినిమాలకు ఫైనల్ కాలేదు. దిగ్గజ హీరోలు, దర్శకులకు కూడా ప్రస్తుతం టైటిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. టైటిల్స్ కోసం ఆన్ లైన్ లో పోటీ పెట్టాలనుకుంటున్నారట.. సో అదీ సినిమా టైటిల్స్ సంగతి..

To Top

Send this to a friend