టాటా గ్రూప్.. చిన్నకారే చిచ్చుపెట్టింది..

naresh-car-tata-mistiటాటా గ్రూప్.. దేశంలోనే పురాతన అతి పెద్ద వ్యాపార సంస్థ.. దాని యాజమాని అయిన రతన్ టాటా సంస్థను దేశంలోనే నంబర్ 1 స్థాయి తీసుకొచ్చిన వ్యక్తి.. అంతటి రతన్ టాటా నిష్క్రమణ తర్వాత టాటా గ్రూప్ తమ వారసుడి ఎంపికలో ఆచితూచి అడుగులు వేసింది.. సైరస్ మిస్త్రీని సమర్ధుడిగా ఎంపిక చేసింది.. కానీ ఆయన రతన్ టాటాల ఆలోచనలకు నీళ్లొదిలాడు.. యూరప్ లోని ప్రఖ్యాత జాగ్వర్ కంపెనీని కొనుగోలు ఖరీదైన మోడల్ కార్లవెంట పరుగులు తీశాడు.. అవి కాస్తా లాభాలు ఇవ్వకపోవడంతో ప్రయత్నం బెడిసికొట్టింది.. అసలు టాటా గ్రూప్ విశ్వసనీయతే భారతీయత మీద ఆధారపడి ఉంది. భారతీయులకు ఏదైనా చేయకుండా విదేశాల్లో కొత్తకంపెనీలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా గుస్సా అయ్యాడు.. అదే వారి మధ్య తొలి విభేదాన్ని సృష్టించింది..
ఇక మిస్త్రీ చేసిన పెద్ద పొరపాటు నానో కారు తయారీని నిలుపుదల చేస్తామనే ప్రకటన.. నానో కారు రతన్ టాటా మానస పుత్రిక.. దేశంలోని మధ్యతరగతికి సొంత కారు ఇవ్వాలనే రతన్ టాటా ఆశయంతో ఈ చిన్న నానో కారును లక్ష రూపాయలకు అందుబాటులో తెచ్చారు. అది కంపెనీకి నష్టాలు తెచ్చిపెడుతున్నా దేశంమీద ఉన్న ప్రేమతో టాటా నానో కారును లాంఛ్ చేశాడు.. ఇప్పుడు నానో కారుకు మిస్త్రీ ఎసరు పెట్టడం.. టాటా ఆలోచనలకు విరుద్ధంగా వెళ్లడంతో మిస్త్రీకి మూడింది.. అందుకే ఉన్నఫలంగా మీటింగ్ పెట్టి మిస్త్రీని టాటా సాగనంపారు. ఇది దేశంలోనే సంచలనం అయ్యింది. ఆ తర్వాత కోర్టులు, కేసులు, ఫిర్యాదులు, ఆరోపణలతో రతన్ టాటా, మిస్త్రీలు ఆడిపోసుకున్నారు. ఇంకా ఆ వివాదం రోజు మిస్త్రీ ఆరోపణలు, లేఖాస్త్రాలతో రగులుతూనే ఉంది.. ఓ చిన్న కారు.. ఓ పెద్ద సామాజ్ర్యంలో చిచ్చుపెట్టింది.. రతన్ టాటా, మిస్త్రీలను దూరం చేసింది..

To Top

Send this to a friend