జ‌ర్న‌లిస్టులకు డ్రెస్ కోడ్.. తెలంగాణ ఖాకీ తీరిది..

పోలీసులకు విచ్చలవిడి అధికారం ఇస్తే ప్రజలు, మీడియాపై వారి ప్రతాపం ఎలా ఉంటుందో ఈ మధ్య వరుసగా కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది.. పోలీసులు హద్దు అదుపు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛతో అమాయకులను ఆట ఆడుకుంటున్నారు. వారి ఆగడాలకు అంతే ఉండట్లేదు..
జ‌ర్న‌లిస్టుకు డ్రెస్ కోడ్ ఉండాలని ఓ పోలీస్ బాస్ హుకూం జారీ చేశాడు. అంతేకాదు.. తనకు ఎవడు జర్నలిస్టు.. ఎవడూ మామూలోడో ఎలా తెలుస్తది.. మీరూ మాలా డ్రెస్ కోడ్ పాటించండి అంటూ హుకూం జారీ చేశాడు..

జ‌ర్న‌లిస్ట్.. ఎప్పుడు, ఎక్క‌డ, ఏ స‌మ‌స్య వ‌చ్చినా చ‌టుక్కున వాలిపోయే ఓ సాదాసీదా వ్య‌క్తి. అంతేనా  ఇక టెక్నాల‌జి ప‌రుగులు తీస్తున్న ఈ కాలంలో రిఫోర్ట‌ర్ ఎవ‌రో కెమెరామెన్ ఎవ‌రో తెలియ‌ని ప‌రిస్థితి కూడా ఎదురువ‌తుంది. అలాంటి ప‌రిస్థితే ఇక్క‌డ కూడా ఎదురైంది. అయితే స‌మ‌స్య ఉన్న చోట స‌మ‌స్య కంటే ముందే వాలిపోయే జ‌ర్న‌లిస్ట్ ఆ స‌మ‌స్య‌ను ఎలా తేల్చాలో ఆలోచించుకుంటు బుర్ర‌పాడు చేసుకునే ఖాకీ కి అస్స‌లు ప‌డ‌ద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.

ఇక అస‌లు విష‌యంలోకి వెళితే నూత‌నంగా ఏర్ప‌డిన మంచిర్యాల జిల్లాలోని బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణం లో ఓ స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలోని కాంటా చౌర‌స్తాలో మున్సిఫ‌ల్ అధికారులు రోడ్డు వెడ‌ల్పు ప‌నులు చేప‌ట్టారు. అందులో భాగంగా వాళ్ల క‌ర్త‌వ్యం వాళ్లు చేసుకుంటు అడ్డు వ‌చ్చిన వాటిని కూల్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇంకెం స‌మ‌స్య ఉంది క‌దా మ‌న రిఫోర్ట‌ర్ అన్న‌లు వాలిపోయారు. రాక‌పోతే స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోక పోతే పైన యాజ‌మాన్యాల నుంచి వార్త రాలేద‌ని దొబ్బులు.. అవెందుకురా బాబు అని ఎలాగైనా తీయాల‌నే ప‌నిలో హ‌డావిడిగా వ‌చ్చేశారు. ఇక కెమెరాకు ప‌ని చెప్పి త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. ఇక్క‌డే మొద‌లైంది అస‌లు స‌మ‌స్య‌.. అక్క‌డి విజువ‌ల్స్ ను త‌మ కెమెరాలో బంధిస్తున్న ఆంద్ర‌జ్యోతి కి చెందిన ఓ రిఫోర్ట‌ర్ మ‌రో లోక‌ల్ ఛాన‌ల్ కు చెందిన రిఫోర్ట‌ర్ పై అక్కడే ఉన్న ఖాకీ బాస్ కాస్త ఓవ‌ర్ గానే రియాక్ట్ అయ్యాడు. ఇక అస‌లే ఖాకీ చొక్కాపవ‌ర్ మాట‌ల‌ను కంట్రోల్ లో ఉంచ‌దు క‌దా.. ఓ నాలుగు మాట‌లు కూడా జారాడే. అంతే మ‌న‌వాళ్ల‌కి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. మా డ్యూటి మేము చేస్తుంటే మీ బాధేంటో చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. ఇక ఆ ఏసీపీ బాస్ మ‌రో అడుగు ముందుకు వేసి అస‌లు మీరు రిపోర్ట‌ర్ల‌ని ఎవ‌డికి తెలుసు.. మీకేమ‌న్నా కొమ్ములున్నాయ‌నే స్టైల్ లో క్లాస్ పీకాడు.. మాల మీకు ఓ డ్రెస్ కోడ్ ఉంటే క‌దా అస‌లు రిఫోర్ట‌ర్ ఎవ‌డో.. సామాన్యుడు ఎవ‌డో తెలిసేది అని. ఇగో ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. జ‌ర్న‌లిస్ట్ కు డ్రెస్ కోడా..? లోకం మీద ఎక్క‌డ‌ లేని కొత్త రూల్ ని చెప్పిన‌ బెల్లంప‌ల్లి ఏసీపీ స‌తీష్ మాట‌ల‌తో ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్ లోకం ఆలోచ‌న‌లో ప‌డింది.

ఆగ‌మేఘాల మీద అస‌లు తిన్న‌మో లేదో కూడా ఆలోచించ‌కుండా.. ఒంటి మీద ఇస్త్రి చొక్కా ఉందా, న‌లిగినా అంగి ఉందా అని కూడా చూసుకోకుండా ఫీల్డ్ మీద‌కు వ‌చ్చే రిఫోర్ట‌ర్ కు డ్రెస్ కోడ్ ఉండాల‌..? అలా అయితే తెలంగాణ లోనే కాదు భార‌త‌దేశంలో ఎక్క‌డ కూడా జ‌ర్న‌లిస్ట్ అనే వాడే క‌నిపించ‌డు. ఇప్ప‌టికే కార్పోరెట్ రూపం దాల్చిన ఫోర్త్ ఎస్టేట్ ఇలాంటి ఖాకీల వింత ప్ర‌శ్నల‌కు ది ఫోర్త్ ఎస్టేట్ కూడా 100 కు 100 శాతం కార్పొరెట్ మ‌యం కావాల‌న్న‌దే ఇక్క‌డ అస‌లు స‌మాదానం. అయితే ఇక చివ‌రి జ‌వాబు ఏంటంటే.. అధికారం ఉంది క‌దా అని ఎదురుగా ఉన్న‌వాడు ఎవ్వ‌డైనా స‌రే నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌టం మాత్రం త‌గ్గ‌డం లేదు. బెల్లంప‌ల్లి లో జ‌ర్న‌లిస్ట్ లు ప‌ట్టుప‌డుతున్న విష‌యం కూడా ఇదే. ఖాకీ చొక్కా ప‌రువు నిల‌బెట్టేలా మాట‌లు మాట్లాడండి నోటి కొచ్చింది వాగ‌డం కాద‌ని. నిన్న హైద‌ర‌ాబాద్.. మొన్న ఎల్బీన‌గ‌ర్.. నేడు బెల్లంప‌ల్లి రేపు మ‌రో చోటు.. ప్లేస్ మారిన పోలీసుల పేస్ మాత్రం మార‌దు క‌దా. అవే మాట‌లు అవే నైజం అదే తీరు. ఒక్క బెల్లంప‌ల్లే కాదు యావ‌త్ తెలంగాణ రాష్ట్రంలో ఖాకీల ప‌రిస్థితి ఇదే.

To Top

Send this to a friend