జ‌న‌వ‌రి 6 న “ఏ రోజైతే చూశానో..”

Smithika-charya

స్మితికాచార్య ని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేస్తూ మ‌నోజ్‌నంద‌న్ జంట‌గా బాల‌.జి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.య‌స్‌.క్రియోష‌న్స్ అండ్ శ్రీ శివ‌పార్వ‌తి కంబైన్స్ బ్యాన‌ర్ లో త‌న్నీరు సింహ‌ద్రి, సిందిరి గిరి సంయుక్తంగా రూపోందిస్తున్న రోమాంటిక్ ల‌వ్ స్టోరి “ఏ రోజైతే చూశానో..” ఈచిత్రం ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని జ‌న‌వ‌రి 6న విడుద‌లవుంతుంది.

“ఈ చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్న స్మితికాచార్య గ్లామ‌ర్ ఈచిత్రానికే హైలెట్ గా నిలుస్తుంది. విడ‌ద‌ల‌యిన ఆడియో కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. యూత్ అంద‌రూ ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాము. మంచి న‌టీన‌టుల‌తో చాలా క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి తీసాము. 2017 లో మెద‌టి వార‌మే మా చిత్రం విడుద‌ల కావ‌టం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతూ మా చిత్రాన్నిఅంద‌రిని ఆక‌ట్టుకుంటుద‌ని న‌మ్ముతున్నాము.. “అని నిర్మాత‌లు అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ..” యూత్ అంద‌రిని ఈచిత్రం త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. యూత్‌ఫుల్ రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కించాము. అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. జ‌న‌వ‌రి 6 న విడుద‌ల చేస్తున్నాము. ఈ నూత‌న సంవ‌త్స‌రం మాతో పాటు అంద‌రికి చాలా బాగుండాల‌ని కోరుకుంటున్నాము.” అన్నారు.

To Top

Send this to a friend