జూలై 29న “పెళ్లి చూపులు”

Pellichoopulu
ధర్మపథ క్రియెషన్స్ మరియు బిగ్ బెన్ సినిమాస్ పై రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని సమ్యుక్తంగా, నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం లొ విజయ్ దెవరకొండ, రీతు వర్మ, నందు ప్రధాన పాత్ర ల్లొ నిర్మించిన చిత్రం పెళ్లిచూపులు. 
ఈ చిత్రం రామానాయుడు సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత  డి.సురెష్ బాబు సమర్పణలొ ఈ నెల29 న ప్రేక్షకుల ముందుకు రాబొతొంది. ఇటీవలె ఈ చిత్రాన్ని చూసిన సురెష్ బాబు ఈ చిత్ర దర్శకుడిని నిర్మాతలను అభినందించారు. ఈమధ్యకాలంలొ ఇంత విభిన్న చిత్రం చూడలేదని, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలి అని అందుకే తను ఈ సినిమా విషయంలో ముందుకొచ్చానని తెలిపారు.
పెళ్లి చూపులు చిత్రం లొ అనీష్ కురువిళ్ల గురురాజ్, కెదార్ శంకర్, పద్మజ మొదలగు వారు నటించారు. నగెష్ బన్నెల్ కెమెరా, రవి ఎడిటింగ్, వివెక్ సాగర్ మ్యుజిక్ అందించారు. డి.సురెష్ బాబు సమర్పకులు. ఇటీవలె విడుదల అయిన ఈ చిత్రం పాటలు అమిత ప్రజాదరణ పొందాయి!
To Top

Send this to a friend